హైదరాబాద్ లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి.ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో బీఆర్ఎస్ ( BRS )పతనం ప్రారంభమైందని కిషన్ రెడ్డి తెలిపారు.
అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.