సెలెబ్రెటీలు మామూలుగా అయితే ఒక ట్వీట్ తో లేక వాళ్ళు పర్సనల్ గా శుభాకాంక్షలు తెలియజేసే వీడియోను షేర్ చేస్తారు.కాని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ రూటే సపరేటు.
ఇక విషయంలోకి వెళ్తే క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు డేవిడ్ వార్నర్.తన క్రికెట్ తోనే అభిమానులను అలరించడమే కాకుండా వ్యక్తిగా టిక్ టాక్ వీడియోలతో ఎంతగా అలరించాడో మనకు తెలుసు.
టాలీవుడ్ పాపులర్ డైలాగ్స్ తో వీడియోలు చేస్తూ తెలుగు అభిమానులను ఎంతో అలరిస్తున్న విషయం తెలిసిందే.
2020 లో ఎన్నో రకాలుగా ఎంటర్ టైన్ చేసిన డేవిడ్ వార్నర్ అద్భుతమైన ట్విస్ట్ తో 2020 కి వీడ్కోలు పలికాడు.అసలు ఎవరు ఊహించకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు పాటతో డేవిడ్ వార్నర్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు లైక్ లతో,షేర్ లతో డేవిడ్ వార్నర్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇంకెదుకు ఆలస్యం మరి.మీరు కూడా ఓ లుక్కేయండి మరి.