టీ కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటాయి.ఏ పార్టీలో ఉండనన్ని ఇంటి పోరులు ఈ పార్టీలోనే ఉంటాయి.
ఒక పార్టీలో ఉండే వారంతా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా ఇందులోనే కనిపిస్తుంది.ఈ పార్టీలో ఒకరు ఎదుగుతుంటే సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడం కొత్తేమీ కాదు.
కలిసి మెలిసి పనిచేయడం అనేది ఈ పార్టీలో ఎన్నడూ పెద్దగా కనిపించలేదు.ఈ విషయం మొన్న రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ ను చేసిన తర్వాత ఇంకాస్త క్లారిటీగా అర్థమయిపోయింది.
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ పేరు ప్రకటించిగానే సీనియర్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయిపోయారు.
ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయితే ఓ రేంజ్‌లో ఆరోపణలు కూడా చేశారు.
తనకు రావాల్సిన పదవిని రేవంత్ అడ్డ దారిలో తీసుకుపోయారంటూ తీవ్రంగా విమర్శించారు.ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉంటున్న మాణిక్యం ఠాగూర్ మీద కూడా నోరు పారేసుకున్నారు.
ఠాగూర్ డబ్బులకు రేవంత్‌కు పదవిని అమ్ముకున్నారని చెప్పడం జాతీయ స్థాయిలో పెను సంచలనమే రేపింది.కాగా ఈ వ్యాఖ్యలను అధిష్దానంతో పాటు మాణిక్యం ఠాగూర్ కూడా ఫుల్ సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఓ సారి ఢిల్లీకి కూడా పిలిపించారు.

ఇక అప్పటి నుంచే మాణిక్యం ఠాగూర్ కోమటిరెడ్డిని దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది.కనీసం ఆయనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదని, దీంతో ఇటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం కూడా కోమటిరెడ్డిని పక్కన పెట్టేసినట్టు తెలస్తోంది.అంతకుముందు ప్రతి పనికి ముందు కోమటిరెడ్డిని పిలిచి సలహా తీసుకునే ఇన్ చార్జి కమిటీ ఇప్పుడు కనీసం పార్టీ చేపట్టే కార్యకలాపాలపై వెంకట్ రెడ్డికి సమాచారం కూడా ఇవ్వట్లేదు.
ఈ నేపథ్యంలోనే వెంకట్‌రెడ్డి ఓ మెట్టు తగ్గి మాణిక్యం ఠాగూర్‌ను ఎన్నిసార్లు కలవడానికి ప్రయత్నించినా ఆయన మాత్రం కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదంట.ఇక చేసేది లేక సీనియర్ నేతలను రంగంలోకి దించే పనిలో పడ్డారంట వెంకట్‌రెడ్డి.
.