AP CM Jagan : కుప్పంకు సీఎం జగన్.. హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలు

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఇవాళ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఈ మేరకు హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా ఆయన కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు.

 Cm Jagan Kuppam Tour Krishna Water Through Handriniva-TeluguStop.com

ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం జగన్ కుప్పం బ్రాంచ్ కెనాల్ కు హంద్రీనీవా( Handri Neeva ) నీటిని విడుదల చేయనున్నారు.అనంతరం గుండిశెట్టిపల్లి వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది.కుప్పం టూర్ నేపథ్యంలో ముందుగా సీఎం జగన్ తాడేపల్లి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో కుప్పంకు వెళ్లనున్నారు.రామకుప్పం మండలం రాజుపేట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి.నీటిని విడుదల చేయనున్నారు.తరువాత హెలిప్యాడ్ వద్ద కుప్పం నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ భేటీ కానున్నారు.

అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube