AP CM Jagan : కుప్పంకు సీఎం జగన్.. హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలు

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఇవాళ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఈ మేరకు హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా ఆయన కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు.

ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం జగన్ కుప్పం బ్రాంచ్ కెనాల్ కు హంద్రీనీవా( Handri Neeva ) నీటిని విడుదల చేయనున్నారు.

అనంతరం గుండిశెట్టిపల్లి వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. """/" / సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది.

కుప్పం టూర్ నేపథ్యంలో ముందుగా సీఎం జగన్ తాడేపల్లి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో కుప్పంకు వెళ్లనున్నారు.రామకుప్పం మండలం రాజుపేట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి.

నీటిని విడుదల చేయనున్నారు.తరువాత హెలిప్యాడ్ వద్ద కుప్పం నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ భేటీ కానున్నారు.

అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.

డ్రెస్ కూడా మార్చుకోనివ్వరా… పోలీసుల తీరుపై మండిపడిన బన్నీ!