బాబు రాజకీయం ఇంతేనా...? తిడుతూనే ఫాలో అవ్వడమేనా...?

మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది.… ఆ విధంగానే ఎవరిని ఫాలో అయ్యామన్నది కాదు .అధికారం దక్కిన్నామా లేదా అనే సూత్రాన్ని ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాటించేందుకు సిద్ధం అయ్యాడు.దీనిలో భాగంగానే తెలంగాణలో తనకు రాజకీయ బద్ద శత్రువుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను అనుసరించేందుకు బాబు సిద్ధం అయ్యాడు.

 Chandrababu Naidu Follows Kcr In 2019 Ap Elections-TeluguStop.com

అవ్వడమే కాదు… అప్పుడే అమలు చెయ్యడం కూడా ప్రారంభించేసాడు.దీనిపై రాజకీయంగా విమర్శలు చెలరేగుతున్నా కేసీఆర్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

తనకు వచ్చే ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని… ఎవరేమనుకున్నా ….తాను మాత్రం తనకు తోచిన విధంగానే ముందుకు వెళ్తానని బాబు తెగేసి చెప్పేస్తున్నాడు.తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలు అన్నీ …ఏకమైనా టీఆర్ఎస్ పార్టీ గెలుపు జెండా ఎగరవేసింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయం సాధించడానికి ఆ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ప్రధాన కారణం.ముఖ్యంగా… పింఛన్ దారులు టీఆర్ఎస్ వైపు నిలిచారనే అంచనాలు ఉన్నాయి.పింఛన్లు రెట్టింపు చేస్తామనే మహాకూటమి హామీతో అప్రమత్తమైన టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు పింఛన్ల రెట్టింపు హామీని తమ మ్యానిఫెస్టోలోనూ చేర్చింది.

దీంతో ఇప్పటికే పింఛన్లు టంచన్ గా ఇస్తున్న కేసీఆర్ నే లబ్దిదారులంతా నమ్మారు.

ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేయడం ప్రారంభించాడు.వృద్దాప్య పింఛన్ రెండువేలు , వికలాంగుల పెన్షన్ పదివేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు.రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా(పింఛన్ల) పథకం అతిపెద్దది.

ఈ పథకం కింద సుమారు 50 లక్షల 61 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు.ప్రతి నెల సుమారు రూ.550 కోట్లు పింఛన్ల కోసం ప్రభుత్వం ఖర్చుపెడుతోంది.అయితే, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వం ఈ పింఛన్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇదే సమయంలో రైతు రుణమాఫీలో మిగిలిపోయిన నాలుగు, ఐదో విడతలు కూడా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది.జనవరిలోనే ఇందుకు సంబంధించిన రూ.8 వేల కోట్లను విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.ఒకవైపు పింఛనుదారులు… రైతులను… మచ్చిక చేసుకుంటున్న బాబు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపునే మరికొన్ని ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టినందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube