రవితేజకు మాస్ పాఠాలు నేర్పనున్న ఎమ్మెల్యే

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ వేసవి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది.కానీ కరోనా ప్రభావంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

 Catherine Tresa Item Song In Raviteja Movie, Raviteja, Krack, Catherine Tresa, I-TeluguStop.com

ఇక ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్తలు వచ్చినా, చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని తేల్చేశారు.దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, రవితేజ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.

ఇప్పటికే నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు రవితేజ రెడీ అయ్యాడు.

ఈ సినిమాతో పాటు మరో డైరెక్టర్ రమేష్ వర్మ డైరెక్షన్‌లో కూడా ఓ సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేష్‌లు నటిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్ ఉండబోతుందని, అందులో రవితేజతో చిందులేసేందుకు ఓ బ్యూటీని ఇప్పటికే ఓకే చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ కేథరిన్ త్రేసా, ఆ తరువాత వరసగా సినిమాలు చేస్తూ వస్తోంది.సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్ర ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది.

ఇక ఈ బ్యూటీ, ప్రస్తుతం బోల్డ్ పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్‌గా మారడంతో, ఆమెను ఈ సినిమాలోని ఐటెం సాంగ్‌లో తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది.ఇక ఈ పాటలో రవితేజతో అమ్మడు వేసే చిందులు మాస్ ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

మొత్తానికి ఈ ఐటెం సాంగ్ కేథరిన్ త్రేసాకు మంచి బ్రేక్ ఇవ్వనుందనే వార్త ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగిస్తుంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube