కోలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ కి అవకాశాలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.అక్కడ స్టార్ హీరోలతో కూడా జతకడుతున్న ఈ అమ్మడు మరో వైపు నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది.
తెలుగులో ఇంకా సరైన బ్రేక్ రాకపోయినా కూడా తమిళ ప్రజలు మాత్రం ఐశ్వర్య రాజేష్ ని బాగా ఆదరిస్తున్నారు.అక్కడి దర్శకులకి కూడా ఈ అమ్మడు మెయిన్ ఫోకస్ అవుతుంది.
ప్రస్తుతం ఈ భామ తెలుగులో నాని హీరోగా రూపొందుతున్న టక్ జగదీష్ లో ఒక హీరోయిన్గా నటిస్తోంది.తాజాగా ఓ తమిళ సెన్సేషనల్ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
కె.భాగ్యరాజా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ముందానై ముడిచ్చు అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో తెలుగులో మూడు ముళ్లు పేరుతో రీమేక్ కూడా చేశారు.
37 ఏళ్ల తరవాత ఇప్పుడు ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేయబోతున్నారు.కోలీవుడ్ లో విభిన్న చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందిన శశికుమార్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి బాలాజీ దర్శకత్వం వహించబోతున్నారు.రీమేక్ కి కథకి ఒరిజినల్ దర్శకుడైన కె.భాగ్యరాజా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం.ముందానై ముడిచ్చు రీమేక్‌లో నటిస్తుండటం తనకెంతో ఎగ్జయిటింగ్‌గా ఉందని, ఓ ల్యాండ్ మార్క్ సినిమాలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఐశ్వర్యారాజేశ్ ఈ సందర్భంగా ట్వీట్ చేసింది.మొత్తానికి తమిళంలో ఐశ్వర్య రాజేష్ చేస్తున్న సినిమాలు చూస్తే ఆమె స్టార్ హీరోయిన్ గా కోలీవుడ్ లో నయనతార తర్వాత ఆ చైర్ లోకి వచ్చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.
ఏది ఏమైనా తెలుగు దర్శకులు గుర్తించని ఓ తెలుగమ్మాయి తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఎదగడం నిజంగా గొప్ప విషయం.