చిన్న వాట్సాప్ మెసేజ్ ఓ మహిళ జీవితాన్ని కాపాడింది వ్యభిచార గృహంలో చిక్కుకున్న ఆ మహిళను విశాఖ పోలీసులు రక్షించారు, ఇండియా చూపిస్తామనీ నమ్మించి కొలకత్తా మీదుగా విశాఖలో వ్యభిచార గృహానికి మహిళలు తరలించిన ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.విశాఖ సిటి పోలీస్ కమీషనర్ తెలిపిన వివరాలు ప్రకారం.
బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళకు కోల్ కత్తా ఈస్ట్ 24 పర గనాల జిల్లాలో కొందరు స్నేహితులు ఉన్నారు.వాళ్ళు ఇండియా చూపిస్తామని చెప్పడంతో ఆమె బోర్డర్ దాటి వచ్చింది.
అక్కడ కొన్ని ప్రదేశాలు చూపించిన తర్వాత కేరళకు చెందిన వినీల్ విశాఖ రావాల్సిందిగా ఆమె ను కోరారు.ఈమేరకు ఆమెకు ఓ నకిలీ ఆధార్ కార్డు ఇచ్చారు.
విశాఖ వచ్చిన ఆమె ను భీశెట్టి దన లక్ష్మి వద్ద వుంచారు.అక్కడ ఆమె బంగ్లాదేశ్ మహిళను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసింది అలాగే కొందరు విటులను కూడా పంపించింది.
ఈ విషయాన్ని ఆమె బంగ్లాదేశ్లో ఉన్న సోదరుడు స్నేహితుడికి సమాచారం అందించింది అతను కోల్ కత్తా లో ఉన్న ఓ వ్యక్తి ద్వారా విశాఖ సి పి వాట్సాప్ నంబర్ 9493336633 కు ఫోన్ చేశారు.దీనిపై పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, అధికారులను ఆదేశించిగా రంగంలోకి దిగిన పోలీసులు, విశాఖలోని సుజాతనగర్ లో వ్యభిచార గృహంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ మహిళను కాపాడారు.
ప్రస్తుతానికి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు దీనికి మూలమైన మున్నా అనే వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు
.