కోలుకుంటోన్న బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థ.. ఎన్నికల వేళ రిషి సునాక్‌‌కు ఉపశమనం

ఎన్నో అంచనాల మధ్య బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన రిషి సునాక్( Rishi Sunak ) తన చాకచక్యంతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు.ఆర్ధిక మాంద్యం, వలస సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి పరిస్ధితులతో దేశం అల్లాడుతున్న వేళ ఆయన సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు.

 Boost For Rishi Sunak Uk Exits Recession With Better-than-expected 0.6 Percent G-TeluguStop.com

రిషి సునాక్ కృషి ఫలితంగా బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థ( Britain Economy ) ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మూడేళ్ల తర్వాత వృద్ధిని నమోదు చేసింది.తద్వారా ఎన్నికలకు ముందు ప్రధాని రిషి సునాక్‌కు, ఆయన పార్టీకి సానుకూల పరిస్ధితులను తెచ్చిపెట్టాయి.

Telugu Bank England, Britain Economy, Jeremy Hunt, Rishi Sunak, Uk Economy, Uk E

ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్( Office for National Statistics ) ప్రకారం స్థూల దేశీయోత్పత్తి మార్చి వరకు మూడు నెలల్లో 0.6 శాతం పెరిగింది.ఇది 2021 నాలుగో త్రైమాసికం తర్వాత 1.5 శాతం బలమైన విస్తరణగా విశ్లేషకులు చెబుతున్నారు.అయినప్పటికీ రిషి సునాక్ , ఆర్ధిక మంత్రి జెరెమీ హంట్( Finance Minister Jeremy Hunt ) ఓటర్లను ఆలోచించేలా టచ్‌లో లేరని ఆరోపించింది.

ఒపీనియన్ పోల్స్‌లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆధిక్యంలో వున్న సంగతి తెలిసిందే.ఈ ఫలితాలపై హంట్ స్పందించారు.గడిచిన కొన్నేళ్లుగా దేశ ఆర్ధిక వ్యవస్థ కష్టతరంగా వుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.కానీ కోవిడ్ మహమ్మారి తర్వాత తొలిసారిగా బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థ కోలుకుంటోంది అనడానికి నేటి వృద్ధి గణాంకాలే రుజువని హంట్ పేర్కొన్నారు.

Telugu Bank England, Britain Economy, Jeremy Hunt, Rishi Sunak, Uk Economy, Uk E

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్.( Bank Of England ) గురువారం 16 సంవత్సరాల గరిష్ట స్థాయి వద్ద వడ్డీ రేట్లను కలిగి వుంది.ఈ ఏడాది తొలి త్రైమాసికంలో త్రైమాసిక వృద్ధి 0.4 శాతం, రెండవ త్రైమాసికంలో 0.2 శాతం పెరుగుదలను బ్యాంక్ అంచనా వేసింది.గణాంకాలు విడుదలైన కాసేపటికే యూఎస్ డాలర్‌తో స్టెర్లింగ్ బలపడింది.నెలవారీ ప్రాతిపదికన రాయిటర్స్ పోల్‌లో ఆర్ధికవేత్తలు అంచనా వేసిన 0.1 శాతం వృద్ధి కంటే వేగంగా మార్చిలో ఇది 0.4 శాతం పెరిగింది.కోవిడ్ మహమ్మారి ప్రభావాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న దేశాలలో బ్రిటన్ ఒకటి.జీ7 దేశాలలో ఒక్క జర్మనీ ఆర్ధిక వ్యవస్థ పరిస్థితే అధ్వాన్నంగా వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube