యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా ప్రశాంత్ నీల్( Prasanth Neel ) దర్శకత్వం లో వచ్చిన సలార్ సినిమా( Salaar ) సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.అయితే ఈ సినిమా పాన్ ఇండియాలో 700 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది.
ఇక మరోసారి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ గా సలార్ 2( Salaar 2 ) సినిమా కూడా రాబోతుంది.అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టలెక్కుతుంది అనే దానిమీద ఇంకా క్లారిటీ లేదు.
కానీ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ బ్యూటీ అయినా కరీనా కపూర్ ని( Kareena Kapoor ) తీసుకునే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ క్యారెక్టర్ శౌర్యంగుల వైపు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఆమె ప్రభాస్ కి ఏమవుతుంది అనే రిలేషన్స్ ఏవి ఇంకా బయటకి రాలేదు కానీ తను పక్కాగా ఈ సినిమాలో మాత్రం ఒక కీలకపాత్రను పోషించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక మొత్తానికైతే సలార్ 2 ఒక భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ గ్యాప్ లో ప్రభాస్ స్పిరిట్, ( Spirit ) హను రాఘవపూడి సినిమాలను పూర్తిచేసుకొని సలార్ 2 సినిమా మీద ఫ్రెష్ గా కూర్చోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఆ లోపు ప్రశాంత్ నీల్ ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సెట్స్ మీద కి తీసుకెళ్లడానికి రెడీ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.చూడాలి మరి ఈ సినిమాతో ప్రభాస్ గాని, ప్రశాంత్ నీల్ గానీ ఎలాంటి సక్సెస్ సాధిస్తారు అనేది…ఇప్పుడు కల్కి సినిమాతో( Kalki ) భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని ప్రభాస్ ప్రయత్నం అయితే చేస్తున్నాడు.మరి ఈ సినిమాతో ఆయనకి సక్సెస్ దక్కుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…
.