గ్రేట్ : బిక్షాటన చేస్తున్న బాలికను చదివించేందుకు ముందుకొచ్చిన ప్రముఖ నటుడు...

మామూలుగా కొంతమందిలో మంచి ప్రతిభ ఉన్నప్పటికీ చదువుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో చాలా మంది చిన్నారుల జీవితాలు బాల్యంలోనే కష్టాల పాలు అవుతున్నాయి.దీంతో కొంతమంది పిల్లలు తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం చిన్నతనంలోనే బిక్షాటన చేయడం మరియు చిన్న చిన్న పనులకు వెళ్ళడం వంటివి చేస్తున్నారు.

 Bollywood Actor Anupam Kheer Helped To The Beggar Girl For Studies, Beggar Girl-TeluguStop.com

అయితే తాజాగా ఓ చిన్నారి ఇంగ్లీష్ భాషను అనర్గళంగా మాట్లాడుతుండటంతో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు ఫిదా అయ్యి ఆమె లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి చదివిస్తానని మాట ఇచ్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవలే బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో నేపాల్ దేశానికి పర్యటించడానికి వెళ్ళాడు.ఈ పర్యటనలో భాగంగా అనుపమ్ ఖేర్ ఓ దేవాలయాన్ని సందర్శించేందుకు వెళ్ళాడు.ఆ సమయంలో ఆర్తి అనే ఓ చిన్నారి భిక్షాటన చేస్తూ కనిపించింది.ఈ క్రమంలో అనుపమ్ ఖేర్ తో ఆంగ్ల భాషలో మాట్లాడుతూ తనకు సహాయం చేయమని అడిగింది.

దీంతో చిన్నారి ఆర్తి మాట్లాడిన ఆనర్గళ ఆంగ్లభాష కి నటుడు అనుపమ్ ఖేర్ ఫిదా అయ్యాడు.దీంతో ఆమె ని చదివించేందుకు ముందుకు వచ్చి అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశాడు.

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అంతేకాకుండా విధి రాత సరిగ్గా లేక భిక్షాటన చేస్తున్న బాలికని చేరదీసి చదువుకునేందుకు మంచి మార్గం చూపిన నటుడు అనుపమ్ ఖేర్ ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

అంతేకాకుండా సినీ సెలబ్రిటీలు అప్పుడప్పుడు ఇలాంటి పనుల వల్ల రియల్ లైఫ్ హీరోస్ అని కూడా అనిపించుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో నటుడు అనుపమ్ ఖేర్ కి వయసు మీద పడటంతో సినిమాల పరంగా కొంతమేర ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.కాగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న “కార్తికేయ 2” చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.కాగా ఈ చిత్రంలో హీరోగా తెలుగు ప్రముఖ హీరో నిఖిల్ సిద్ధార్థ నటిస్తుండగా స్వాతి రెడ్డి మరియు అనుపమ పరమేశ్వరన్ తదితరులు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనుల్లో గోవా పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube