బిగ్ బాస్ రియాలిటీ షో దేశ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో చెప్పనవసరం లేదు.అటు హిందీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, తమిళంలో కమలహాసన్, తెలుగులో నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
రకరకాల టాస్క్ లతో వారం వారం రక్తికట్టిస్తూ ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని అందిస్తారు.ముఖ్యంగా మన తెలుగులో తీసుకుంటే ఈ సీజన్ ను కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

కరోనా సమయంలో ఛాలెంజింగ్ గా తీసుకొని నిర్వహించిన ఈ బిగ్ బాస్ 4 అత్యంత ప్రజాదరణ పొందిందని 19.4 రేటింగ్స్ అని చాలా వెబ్ సైట్స్ ఊదరగొట్టిన విషయం మనం చూశాం.ఇప్పుడు బిగ్ బాస్ 4 కు వచ్చిన రేటింగ్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.ఇటీవల స్టార్ మా రిలీజ్ చేసిన రేటింగ్స్ ను బట్టి చూస్తే చివరి వారాన్ని మినహాయిస్తే అట్టర్ ఫ్లాప్ అయిందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ఆహా ఓహో అని అదరగొట్టిన బిగ్ బాస్ రియాలిటీ షో రేటింగ్స్ లో ఢమాల్ అయి అట్టర్ ఫ్లాప్ ను మూటకట్టుకుంది.