వచ్చే అక్టోబరు నెలలో ఏయే రోజులు బ్యాంకులు పనిచేయవో తెలుసా? ఏకంగా 21 రోజులు!

మన దేశంలో చిన్నవాళ్ళనుండి పెద్దవాళ్ళ వరకు లావాదేవీల నిమిత్తం అందరూ వెళ్లే ఏకైక ప్లేస్ బ్యాంక్.అవును, ప్రస్తుతం ప్రతి చిన్న చెల్లింపులకూ డిజిటల్ మార్గాలను వినియోగించటం వల్ల కూడా బ్యాంకులతో సగటు మనిషికి సంబంధం పెరిగింది.

 Bank Holidays October 2022,bank Holiday, October, Month, Holidays List, Banking,-TeluguStop.com

ఈ క్రమంలో అనేక లావాదేవీలు చేసేందుకు వాటితో తప్పక పనిపడుతోంది.అయితే ఇక్కడ చాలామంది బ్యాంక్స్ పనిదినాలను దృష్టిలో పెట్టి వెళితే, వారికి వీలైనంత సమయం కలిసొస్తుంది.

అయితే ఈ అక్టోబర్ నెలలో బ్యాంకులు అత్యధికంగా 21 రోజులు అందుబాటులో ఉండవు.వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకుని పనులను ముందుగానే పూర్తి చేసుకునేందుకు ప్లాన్ చేసుకోండి.

అవును, ఈ నెలలో 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.శని, ఆదివారాలు కలుపుకొని మొత్తం 21 రోజుల బ్యాంకులు మీకు అందుబాటులో వుండవు.

తాజాగా ఏఏ రాష్ట్రాల్లో బ్యాంకులు ఏఏ రోజుల్లో అందుబాటులో ఉండవో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ విడుదల చేసింది.వేరు వేరు రాష్ట్రాల్లో ప్రాంతీయ సెలవులను అక్కడి ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.

మిగిలిన వాటిని రిజర్వు బ్యాంక్ నిర్ణయిస్తుంది.అందువల్ల వినియోగదారులు తమ సంబంధిత శాఖలను సందర్శించే ముందు సెలవుల జాబితాను తనిఖీ చేసుకోవటం ఉత్తమం.

జాబితాలోని కొన్ని సెలవులు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేకమైనవి.అక్టోబర్ నెలలో 21 బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

అక్టోబరులో బ్యాంక్ సెలవుల లిస్ట్.

అక్టోబరు 1 – బ్యాంకు ఖాతాల అర్ధ సంవత్సర ముగింపు

అక్టోబర్ 2 – ఆదివారం గాంధీ జయంతి

అక్టోబర్ 3 – దుర్గా పూజ (మహా అష్టమి)

అక్టోబర్ 4 – దుర్గాపూజ/దసరా

అక్టోబర్ 5 – దుర్గాపూజ/దసరా (విజయ దశమి)/శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం

అక్టోబర్ 6 – దుర్గా పూజ

అక్టోబర్ 7 – దుర్గా పూజ

అక్టోబర్ 8 – రెండవ శనివారం సెలవు

అక్టోబర్ 9 – ఆదివారం

అక్టోబర్ 13 – కర్వా చౌత్

అక్టోబర్ 14 – ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ

అక్టోబర్ 16 – ఆదివారం

అక్టోబర్ 18 – కటి బిహు

అక్టోబర్ 22 – నాల్గవ శనివారం

అక్టోబర్ 23 – ఆదివారం

అక్టోబర్ 24 – కాళీ పూజ/దీపావళి/దీపావళి

అక్టోబర్ 25 – లక్ష్మీ పూజ/దీపావళి/గోవర్ధన్ పూజ

అక్టోబరు 26 – గోవర్ధన్ పూజ/భాయ్ బిజ్/భాయ్ దుజ్/దీపావళి (బలి ప్రతిపద
)

అక్టోబర్ 27 – భైదూజ్/చిత్రగుప్త జయంతి/లక్ష్మీ పూజ/దీపావళి/నింగోల్ చకౌబా

అక్టోబర్ 30 – ఆదివారం

అక్టోబర్ 31 – సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పుట్టినరోజు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube