నందమూరి బాలకృష్ణ( Balakrishna ) హీరో గా ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు.అఖండ, వీర సింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమా లు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.
వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం తో బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించాడు.బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ మూడు విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యం లో ఇప్పుడు బాబీ( Bobby ) దర్శకత్వం లో చేయబోతున్న సినిమా మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా సమాచారం అందుతోంది.
బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా విషయం లో ఫ్యాన్స్ లో చాలా అంచనాలు ఉన్నాయి.బాబీ సినిమా కనుక విజయాన్ని సొంతం చేసుకుంటే వెంటనే ఆదిత్య 369( Adithya 369 ) సినిమా సీక్వెల్ ను బాలకృష్ణ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.వరుసగా నాలుగు విజయాలు దక్కించుకుంటే బాలయ్య ప్రయోగం చేసేందుకు రెడీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అందుకే బాలయ్య నాల్గవ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.
ఆదిత్య 369 సినిమా కోసం స్టోరీ లైన్ ను రెడీ చేశాను అంటూ బాలయ్య పేర్కొన్నాడు.బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమా లతో బిజీగా ఉన్నాడు.బాబీ దర్శకత్వం లో సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ వరకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.బాబీ దర్శకత్వం లో సినిమా ను ముగించిన తర్వాత ఆదిత్య 369 ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
ఆదిత్య 369 సీక్వెల్ విషయం లో ఫ్యాన్స్ తో పాటు బాలయ్య కూడా చాలా ఆసక్తిగా ఉన్నాడు.సింగీతం శ్రీనివాస్ రావు ( Singeetam Srinivasa Rao )సారధ్యం లో ఈ సినిమా ను చేయాలని బాలయ్య చాలా ఆసక్తిగా ఉన్నాడు.