నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అఖండ’.ఈ సినిమాతో మరొకసారి ఈ కాంబో సూపర్ హిట్ అందుకుంది.
ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసి అలరించాడు.
ఈ సినిమా విజయంలో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది.
చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమాపై ప్రేక్షకులు పెట్టుకున్న భారీ హోప్స్ నిజం అయ్యాయి.
అఖండ విజయం ఒక్క తెలుగు రాష్ట్రానికే పరిమితం కాలేదు.విడుదల అయినా ప్రతి చోట అఖండమైన విజయం సాధించింది.
థియేటర్స్ దగ్గర మళ్ళీ పూర్వవైభవం తెచ్చింది.ఇటీవలే ఓటిటి లో కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది.
అలాగే ఈ సినిమాను మన దేశంలోనే ఎక్కువ మంది వీక్షించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
అటు నార్త్ ప్రేక్షకులను కూడా ఈ సినిమా అలరించింది.భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న అఖండ సినిమా ఇప్పుడు వివిధ భాషల్లో రీమేక్ చెయ్యాలని అనుకుంటున్నారు.ఇప్పటికే ఈ సినిమా తమిళ డబ్బింగ్ హక్కులు అమ్ముడు పోవడమే కాకుండా డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసుకుని జనవరి 28న రిలీజ్ చేస్తున్నారు.
మరోవైపు కన్నడ, మలయాళం, హిందీ డబ్బింగ్ హక్కులు తీసుకున్న వారు ఈ సినిమాను ఆయా భాషల్లో రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు.ముందుగా హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటికి రీమేక్ చేసేకంటే డైరెక్ట్ డబ్బింగ్ వర్షన్ అయితేనే బాగుంటుందని కోరడంతో త్వరలోనే ఈ సినిమా హిందీలో రిలీజ్ చేయబోతున్నారు.