హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్‌పై గత అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి జరిగింది.బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుజిత్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారని సమాచారం.
ఆ సమయంలో తన బైక్‌పై సుజిత్ బంజారాహిల్స్‌లో ఉన్న అతని ఇంటికి వెళ్తుండగా ఖైరతాబాద్ చౌరస్తాలో స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేశారట.ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వెంటనే సుజిత్‌ను సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారట.
ఇక ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారట.
ఇకపోతే సుజిత్ రావణ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.