ప్రస్తుతం రోజులు ఎలా ఉన్నాయంటే.ఇంట్లో నుండి వివిధ పనుల కోసం బయటికి వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు అనే నమ్మకం లేదు.
ఎందుకంటే చిన్నచిన్న కారణాలే పెద్ద పెద్ద దారుణాలకు కారణం అవుతున్నాయి.వ్యక్తి చనిపోయిన కొద్ది రోజుల తర్వాతనే అది ఆత్మహత్యనా.? హత్యనా.? లేదంటే యాక్సిడెంటా అనేది బయట పడుతూ అందరిని భయభ్రాంతులకు గురి చేసే సంఘటనలే ఈమధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.ఇలాంటి కోవలోనే స్కూల్ కు వెళ్తున్న గవర్నమెంట్ టీచర్( Government teacher ) గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలంలో చోటుచేసుకుంది.పట్టపగలు నడిరోడ్డుపై హత్య ఎలా జరిగిందో అనే వివరాలు చూద్దాం.
div class=”middlecontentimg”>

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఏగిరెడ్డి కృష్ణ (58) రాజంలో నివాసం ఉంటున్నాడు.ఇతను తెర్లాం మండలంలోని కాలంరాజు పేటలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచరుగా పనిచేస్తున్నాడు.రోజు మాదిరిగానే తన బైక్ పై శనివారం కూడా స్కూలుకు బయలుదేరాడు.
ఏగిరెడ్డి కృష్ణ( Krishna ) తన బైక్ పై ఒమ్మి సమీపంలో ఉండే కొత్తపేట వద్దకు చేరుకోగానే ఓ బొలెరో వాహనం ఆయన బైక్ ను ఢీ కొట్టింది.వెంటనే కృష్ణ కింద పడిపోయాడు.
అనంతరం కొంతమంది ఆయనను కాస్త దూరం ఇనుప రాడ్డులతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే బాధితుడు ప్రాణాలు విడిచాడు.
div class=”middlecontentimg”>

ఈ సంఘటనను కల్లారా చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.ఈ సంఘటనను పరిశీలించిన కుటుంబ సభ్యులు ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని హత్య అని తెలిపారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో కూడా ఇది హత్య అని తేలింది.కాకపోతే ఎవరో కావాలని హత్య చేసి తరువాత యాక్సిడెంట్ గా సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు.
మృతుడి కుమారుడు శ్రావణ్ కుమార్( Shravan Kumar) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.