ఏపీ సీఎం జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
ఇందులో భాగంగా ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు జగన్ సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే.ఈ నివేదికలు ఆధారంగా ఎమ్మెల్యేలకు సూచనలు చేయనున్నారు.
గత సమీక్షలో 27 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం జగన్ ఈసారి కూడా కొందరికి సీరియస్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో నివేదికల్లో ఏముందన్న టెన్షన్ లో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం.