టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఏపీ బీజేపీ ఖండించింది.ఈ మేరకు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ట్వీట్ చేశారు.
సరైన నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సరైనది కాదని పురంధేశ్వరి అన్నారు.ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదని చెప్పారు.
చంద్రబాబు వివరణ తీసుకోలేదన్న పురంధేశ్వరి పోలీసులు ప్రొసీజర్ కూడా ఫాలో కాలేదని విమర్శించారు.ఈ క్రమంలోనే చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని బీజేపీ ఖండిస్తుందని వెల్లడించారు.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా నంద్యాలలో తెల్లవారుజామున చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.