ఏపీలో ప్రతిపక్ష పార్టీలపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.విపక్షాలకు ఇప్పటికైనా వివేకం, ఆలోచనా శక్తి రావాలన్నారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.జగన్ బటన్ నొక్కడం మొదలు పెడితే తమకు పుట్టగతులు ఉండవని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
పెత్తందారులు, దత్తపుత్రుల దుష్ప్రచారం నమ్మొద్దని చెప్పారు.మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో అన్నదే చూడండని ప్రజలకు సూచించారు.
ఇవాళ చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామన్న సీఎం జగన్ చంద్రబాబును చూసి రాష్ట్రమంతా ఇదేం కర్మరా బాబు అనుకుంటోందని మండిపడ్డారు.గత ప్రభుత్వ హయాంలో గజదొంగల ముఠా ఉండేదని విమర్శించారు.
తాము ఎవరితో పొత్తులు పెట్టుకోమని స్పష్టం చేశారు.తమ పొత్తు ఇతర పార్టీలతో కాదని, కేవలం ప్రజలతోనే వైసీపీ పొత్తు ఉంటుందని సీఎం జగన్ తెలిపారు.