ఆర్యన్ ఖాన్ కేసులో ఈ ట్విస్ట్ ఎవ్వరు ఊహించి ఉండరు!

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 3న డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.అప్పుడు అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ దాదాపు ఇరవై రోజుల పాటు జైలు లోనే ఉన్నాడు.

 Aryan Khan Case Officer Sameer Wankhede Removed From Drugs-on Cruise Probe,aryan-TeluguStop.com

మధ్యలో రెండు సార్లూ బెయిల్ అప్లై చేసి కోర్టూ రెండు సార్లు తిరస్కరించింది.దీంతో ఆర్యన్ ఖాన్ కేసు బాలీవుడ్ లో సంచలనం రేపింది.

షారుఖ్ ఖాన్ కూడా తన కొడుకుని బయటకు తీసుకు రావాలని చాలా ప్రయత్నాలు చేసాడు.

గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న లాయర్లను రంగంలోకి దించి ఎట్టకేలకు బెయిల్ ద్వారా ఆర్యన్ ఖాన్ ను బయటకు తీసుకు వచ్చేలా చేసాడు.

అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది.ఆర్యన్ ఖాన్ కేసు విచారించిన సమీర్ వాంఖడే చుట్టూ వివాదాలు చుట్టు ముడుతున్నాయి.ఆయన మీద గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

Telugu Aryan Khan, Aryankhan, Mumbai Coast, Sameer Wankhede-Movie

ఆర్యన్ ఖాన్ కేసులో కూడా సమీర్ వాంఖడే అతడిని తప్పించడానికి 25 కోట్లు అడిగినట్టు వార్తలు వైరల్ అయ్యాయి.ఎన్సిపి నేత నవాబ్ మాలిక్ కూడా సమీర్ వాంఖడే పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.ఆయన నఖిలీ సర్టిఫికెట్స్ తో ఉద్యోగం సంపాదించాడని.

కోట్లకు పడగెత్తాడని మంత్రి ఆరోపించారు.ఈ ఆరోపణల విషయంలో ఎన్సీబీ రంగంలోకి దిగింది.

Telugu Aryan Khan, Aryankhan, Mumbai Coast, Sameer Wankhede-Movie

సమీర్ వాంఖడే తో పాటు మరికొంత మంది అధికారులపై విచారణకు ఆదేశించింది.ఈ విచారణ కొనసాగుతూ ఉండగానే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది.అవినీతి ఆరోపణలు వస్తున్న కారణంగా సమీర్ వాంఖడే ను విధుల నుండి తప్పిస్తున్నట్టు ఎన్సీబీ ఉత్తర్వులు జారీ చేసింది.విచారణ సాగుతుండగానే ఆయనను విధుల నుండి తప్పించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

ఇక ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారించేందుకు ఢిల్లీ నుండి ఎన్సీబీ ప్రత్యేక బృందం ముంబైకి వెళ్లనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube