చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి ఏపీ ప్రభుత్వం మరిన్ని పటిష్ట చర్యలు చేపట్టనుంది.మహిళా, శిశు సంక్షేమ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
దీనిలో భాగంగా బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనతతో పాటు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇందులో భాగంగా నిర్ధేశించుకున్న ప్రమాణాలతో అంగన్ వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి చర్యలు తీసుకోనున్నారు.
అదేవిధంగా అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేక యాప్ లను రూపొందించనున్నారు.