AP MLAs Disqualified : ఏపీలో సంచలనం : ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఏపీ ఎన్నికలలో తమ సత్తా చాటుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న సమయంలోనే, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం( Tammineni Seetaram ) సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకోవడంతో, ఆయన ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పి పి కే రామాచార్యులు నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

 Ap Mlas Disqualified : ఏపీలో సంచలనం : ఎనిమిద�-TeluguStop.com

ఇప్పటి వరకు వైసీపీ, టిడిపి రెబల్ ఎమ్మెల్యే లపై వచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతూ వచ్చిన స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకుని వారిపై అనర్హత వేటు వేశారు.ఇటీవలే అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణను ముగించారు.

నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతతో వేటు వేయాలని స్పీకర్ కు వైసిపి , నలుగురు ఎమ్మెల్యేలపై టిడిపి పిటిషన్ లు వేశాయి.ఆనం రామనారాయణ రెడ్డి,( Anan Ramnarayanareddy ) మేకపాటి చంద్రశేఖర రెడ్డి,( Mekapati Chandrashekarareddy ) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ,ఉండవల్లి శ్రీదేవి ఈ లిస్ట్ లో ఉన్నారు.

Telugu Ap, Janasena, Karanam Balaram, Kotamsridhar, Maddala Giri-Politics

టిడిపి పిటిషన్ లో మద్దాల గిరి,( Maddala Giri ) కరణం బలరాం,( Karanam Balaram ) వాసుపల్లి గణేష్( Vasupalli Ganesh ) ఉన్నారు.మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఒకేసారి వేటు వేశారు.వైసిపి నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వైసీపీ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు స్పీకర్ కు ఫిర్యాదు చేయగా, గెలిచి పార్టీకి దూరంగా ఉంటున్న వాసుపల్లి గణేష్ కుమార్, కరణం బలరాం, మద్దాల గిరి, వల్లమనేని వంశీ పై అనర్హత వేటు వేయాలని టిడిపి విప్ డోలా బాలాంజనేయ స్వామి కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

Telugu Ap, Janasena, Karanam Balaram, Kotamsridhar, Maddala Giri-Politics

ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనేకసార్లు ఎమ్మెల్యేలను విచారించారు.వారి నుంచి వివరాలు తీసుకున్నారు.కొన్ని సందర్భాల్లో రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు దూరంగా ఉన్నారు.

తాజాగా దీనిపై విచారణ ముగించినట్లేనని స్పీకర్ ప్రకటించారు.ఈ వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది.

ప్రస్తుతం అన్ని పార్టీలు అభ్యర్డ్ల జాబితా ను తయారుచేసే పనిలోనే నిమగ్నం అయ్యాయి.చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు.

ఈ సమయంలోనే ఈ అనర్హత పిటిషన్ ల పై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube