Allu Arjun Nayanthara : ఆ రోజు అవమానానికి నేడు నయనతారపై బన్నీ ప్రతీకారం తీర్చుకుంటున్నాడా..?

అల్లు అర్జున్, నయనతార కాంబినేషన్‌లో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా రాలేదు.అయితే వారి కాంబినేషన్ లో ఏ సినిమా రాకూడదని కోరుకునే అభిమానులు చాలామంది ఉన్నారు.

 Allu Arjun Revenge On Nayanthara-TeluguStop.com

ఎందుకంటే ఒక పబ్లిక్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ను( Allu Arjun ) నయనతార అవమానించింది.నానుమ్ రౌడీ ధాన్ (2015) సినిమాలో విజయ్ సేతుపతి సరసన నయనతార( Nayanthara ) నటించిన సంగతి తెలిసిందే.

తెలుగులో “నేనూ రౌడీనే”గా( Nenu Rowdy Ne ) ఇది డబ్‌ అయింది.హీరో ధనుష్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకి రూ.14 కోట్లు పెడితే రూ.31 కోట్లు వచ్చాయి.ఈ మూవీలో నయనతార యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు.అందుకే ఆమెకు ఈ సినిమాలో చూపించిన నటనకు గాను చాలా అవార్డ్స్ వచ్చాయి.అయితే ఒక ఫంక్షన్ లో ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును ఆమెకు ఇవ్వడానికి స్టేజి మీదకి అల్లు అర్జున్ వచ్చాడు.ఆ సమయంలో నయనతార అల్లు అర్జున్ చేతుల మీదగా అవార్డు తీసుకోవడానికి ఒప్పుకోలేదు.

అవార్డును తనకు కాబోయే భర్త విగ్నేష్ శివన్( Vignesh Shivan ) చేతుల మీదగా తీసుకోవాలనుకుంటున్నానని అందరి ముందే కొంచెం కూడా మర్యాద లేకుండా చెప్పేసింది.దానివల్ల అల్లు అర్జున్ బాధపడాల్సి వచ్చింది.

స్టేజ్ పై నుంచి కిందకు దిగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.ఇక ఫ్యాన్స్ అయితే ఆమెను ఏకిపారేశారు.హీరోల పట్ల కనీస గౌరవం చూపించడం లేదని ఆమెపై విమర్శలు గుప్పించారు.2016 సమయంలో ఈ ఘటన అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపింది.

Telugu Allu Arjun, Alluarjun, Actress Award, Nayanthara, Nenu Rowdy Ne, Tollywoo

అయితే ఆ రోజు జరిగిన అవమానాన్ని బన్నీ ఇప్పటికీ మర్చిపోలేదట.పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ట్ డమ్‌ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ సరసన నటించేందుకు హీరోయిన్లు ఎగబడుతున్నారు.సౌత్ ఇండియన్ హీరోయిన్ లతోపాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా బన్నీ సినిమాలో( Bunny Movie ) ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకుంటున్నారంటే అతని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.అయితే బన్నీ నెక్స్ట్ సినిమాలో నయనతారను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట.

నయనతార కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుందని అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మరిన్ని అవకాశాలు పొందచ్చని బన్నీతో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యిందట.

Telugu Allu Arjun, Alluarjun, Actress Award, Nayanthara, Nenu Rowdy Ne, Tollywoo

కానీ బన్నీ మాత్రం మర్యాద లేని, తల పొగరున్న హీరోయిన్లతో తాను అసలు నటించనని తెగేసి చెప్పేస్తున్నాడట.నయనతార పేరు వినగానే ఆమె సినిమాలో ఉంటే నేను సినిమా చెయ్యను అని కుండబద్దలు కొట్టాడట.ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బన్నీ ఇలాగే ప్రతీకారం తీర్చుకోవాలని, ఎవరితో ఎలా ప్రవర్తించాలో అప్పుడు గానీ ఆమెకు తెలియరాదు అని కామెంట్లు పెడుతున్నారు.

మరి ఇది కేవలం సినీ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే.ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube