ఆ హీరో వయసు అప్పుడు కేవలం 18 ఏళ్లు మాత్రమే.వాలీబాల్ ఆడుకుంటూ చదువుకుంటున్న వ్యక్తిని రోడ్డుపై చూసి అతడే నా హీరో అని డైరెక్టర్ వసంత్( Director Vasanth ) ఫిక్స్ అయ్యారు.
కానీ అసలు ఎలాంటి కానీ అసలు ఎలాంటి సినిమా జ్ఞానం, లోకజ్ఞానం కూడా లేని ఆ పిల్లోడు ఏమీ అర్థం కాక నావల్ల కాదు అంటూ చేతులెత్తేశాడు.అయినా కూడా వసంత్ టీం కోచ్ ఇచ్చిన సలహాతో సినిమా హీరోగా మారడానికి ఒప్పుకున్నాడు తమిళ హీరో మహేష్( Tamil hero Mahesh ).అలా షాపింగ్ మాల్ అనే సినిమాతో హీరోగా అవతారం ఎత్తి ఆ తర్వాత 14 సినిమాలు చేసిన షాపింగ్ మాల్( Shopping mall ) లాంటి ఒక అద్వితీయమైన చిత్రాన్ని చేయలేకపోయాడు.ఆ సినిమా అతడికి అవకాశాలు ఇచ్చినా కూడా అవి నిలబడలేదు.
పైగా వయసు చిన్నది అనుభవం లేకపోవడంతో ఏ చిత్రం పడితే ఆ చిత్రం ఒప్పుకొని ఎక్కువగా పరాజయాలు చవి చూశాడు.
హీరో మహేష్ ఒక తమిళ ఇన్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరికైనా జీవితంలో జరిగిన అనేక సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.షాపింగ్ మాల్ సినిమా తమిళ్ లో అతిపెద్ద విజయంగా నిలబడింది.ఆ సినిమాలో నటించడానికి ముందు మహేష్ కి ఎలాంటి అనుభవం లేదు వసంత్ ఎన్నోసార్లు అతడి నటన గురించి కోప్పడేవాడు కొన్నిసార్లు కొట్టేవాడట.కేవలం సినిమా బాగా రావాలని తపనతోనే అలా చేసేవాడు అని చెబుతున్నాడు మహేష్.180 రోజులపాటు జరిగిన ఈ షెడ్యూల్ ఎక్కువగా రాత్రిపూటనే జరిగింది.నిజమైన షాపింగ్ మాల్ లో రాత్రి ఆరు నుంచి 6 వరకు షూటింగ్ చేసేవారు.రద్దీగా ఉండే జనాల మధ్య కెమెరాలు పెట్టి ఎవరికి తెలియకుండా మరీ షూట్ చేసేవారట.
ఇక ఆ సినిమా మొత్తం అనుభవన్లో తనకు బాగా ఇబ్బంది పెట్టిన సంఘటన ఏదైనా ఉంది అంటే అది అంజలితో( Anjali ) రొమాన్స్ చేసే విషయం.ఎందుకంటే అంజలి మహేష్ కన్నా కూడా మూడేళ్లు పెద్దది పైగా సీనియర్.ఆమెను ముద్దు పెట్టుకోవాల్సిన సీన్ ముందు రోజే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి గట్టిగా ఏడ్చాడట.తన వల్ల కాదు అక్కడ నుంచి పారిపోవాలనుకుంటున్నానని కూడా చెప్పాడట.
కానీ వాళ్ళ అమ్మ ధైర్యం చెప్పడంతో ఆ సీన్ పూర్తి చేశాడట.ఆ తర్వాత అంజలి మంచి స్నేహితురాలిగా మారిందని ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటుందని తెలిపాడు మహేష్.
కానీ తన కెరియర్ మాత్రం బాగోలేదని మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు.