ఆ బొమ్మను టచ్ చేస్తే చాలు.. నీ ఉద్దేశం ఏంటో ఇట్టే చెప్పేస్తుంది..!

ప్రస్తుత రోజులలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరిని కూడా వదిలి పెట్టకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గులు ఎందరో ఉన్నారు.దీనితో లైంగిక దాడులకు పాల్పడుతున్న మని కూడా  తెలియని చిన్నారులు ఉన్నారు.

 All You Have To Do Is Touch The Toy It Will Tell You What You Mean , Samskar To-TeluguStop.com

ఇందుకు గల ముఖ్య కారణం వారికి సరైన అవగాహన లేకపోవడమే.అంతే కాకుండా ఏది మంచి, ఏది చెడు అని తెలియకపోవడం, చుట్టూ ఉన్నవారితో ఎవరు మంచి వారు, ఎవరు చెడ్డవారు అని తెలుసుకోలేకపోవడమే.

చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి భరద్వాజ్ మరొక ఇద్దరి సహకారంతో వినుత్న ఆలోచనతో ప్రత్యేక బొమ్మను తయారు చేశారు.

ఆ ప్రత్యేకమైన బొమ్మలను ముట్టుకున్నప్పుడుల్ల గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ అని శబ్దాలు వినపడతాయి.

అంతేకాకుండా ఆ బొమ్మలు మరింత అభివృద్ధి చేసేందుకు ప్రముఖ పాఠశాలలో  చిన్నారులకు అవగాహన కల్పించేందుకు సహకరిస్తుందని సోషల్ మీడియా వేదికగా భరద్వాజ్ పేర్కొన్నాడు.దీనితో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో పాటు షీ-టీమ్, తెలంగాణ స్టేట్‌ తదితర విభాగాలు స్పందించి ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ వరంగల్ కు చెందిన  రూరల్‌ ఇన్నోవేటర్‌ యాకర గణేశ్‌ సహకారంతోనే ఈ ప్రత్యేక బొమ్మలు తయారు చేసినట్లు పేర్కొన్నారు.

Telugu Bad Touch, Bharadwaj, Touch, Samskar Toy, Telangana, Yakara Ganesh-Latest

ఈ ప్రత్యేకమైన బొమ్మకు సంస్కార్ అని పేరు పెట్టినట్లు., దీనిని తయారు చేసేందుకు సెన్సార్లు, ట్రాన్సిస్టర్లు, స్పీకర్, మైక్రో ప్రాసెసర్లను వినియోగించినట్లు తెలిపారు.ఆ బొమ్మలోని వేరు వేరు భాగాలను తాకినపుడుల్ల గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ అనేది స్పీకర్ ద్వారా స్పందిస్తుంది.

ప్రత్యక్షంగా చిన్నారులకు చూపించి వేగంగా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందజేయాలని రాజ్ కోరారు.అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు లైంగిక వేధింపులకి సంబంధించి అవగాహన కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం అని భరద్వాజ్, యాకర గణేష్ తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube