విజయ్ సేల్స్ మెగా రిపబ్లిక్ డే సేల్స్ ఇప్పుడు భారత మార్కెట్లో కూడా వినియోగదారులకు అందబాటులో కలదు.ఈ ప్లాట్‌ఫారమ్ లేటెస్టుగా ఆపిల్ iPhone 14, Galaxy Buds 2 TWS ఇయర్‌బడ్‌లతో సహా అనేక ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ పైన భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
పర్టిక్యులర్ గా ఈ 2 డివైజ్‌లపై ధర భారీ తగ్గింపు ధరలను పొందవచ్చు.కస్టమర్లు బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు ధరను పొందవచ్చు.ఐఫోన్ 14 మోడల్ ధర రూ.79,900 నుంచి రూ.74,900లకే సొంతం చేసుకోవచ్చు.HDFC బ్యాంక్ కార్డ్‌లను కలిగి ఉన్న కస్టమర్లు రూ.4వేలు విలువైన ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
![Telugu Iphone Offers, Republic Day, Vijay-Latest News - Telugu Telugu Iphone Offers, Republic Day, Vijay-Latest News - Telugu]( https://telugustop.com/wp-content/uploads/2023/01/republic-day-sales-iPhone-offers-Galaxy-buds-deals.jpg)
Galaxy Buds 2 TWS ఇయర్‌బడ్‌లు అయితే రూ.11,999 వరకు తగ్గించి మరీ రూ.5,999కి విక్రయిస్తున్నారు.Galaxy Buds 2 శాంసంగ్ ఫోన్లతో మెరుగ్గా పని చేస్తుంది.ఇతర Android ఫోన్లు, టాబ్లెట్లు Galaxy Buds యాప్‌కు కూడా ఇవి సపోర్టు చేస్తాయి.శాంసంగ్ బడ్స్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బ్యాంక్ ఆఫర్ ఉంది.అంతేకాకుండా ఐఫోన్ 13 మోడల్ బ్యాంక్ ఆఫర్లను మినహాయించి రూ.64,900కు సొంతం చేసుకోవచ్చు.ఐఫోన్ 12 మోడల్‌పై బ్యాంక్ ఆఫర్లు లేకుండా రూ.59,900 వద్ద అందుబాటులో ఉంది.
![Telugu Iphone Offers, Republic Day, Vijay-Latest News - Telugu Telugu Iphone Offers, Republic Day, Vijay-Latest News - Telugu]( https://telugustop.com/wp-content/uploads/2023/01/mega-republic-day-sales-iPhone-offers.jpg)
Samsung Galaxy Tab A7 Lite Wifi టాబ్లెట్ రూ.14,500కి బదులుగా రూ.9,999కి మాత్రమే విక్రయిస్తున్నారు.ఫైర్-బోల్ట్ నింజా కాల్ 2 స్మార్ట్‌వాచ్ అయితే ఏకంగా రూ.7,999 నుంచి తగ్గి రూ.1,999కి అందుబాటులో ఉంది.అంతేకాకుండా, రూ.11,490 ధరలో అద్భుతమైన టీవీలను పొందవచ్చు.ICICI బ్యాంక్ కార్డ్ హోల్డర్లు అయితే రూ.20వేల కన్నా ఎక్కువ క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.3వేల వరకు 7.5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, రూ.20వేల కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై రూ.1,500 వరకు 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ జనవరి 25 నుంచి పొందవచ్చు.అయిదు మెగా రిపబ్లిక్ డే సేల్ ఎప్పుడు ముగుస్తుందో ఇంకా రివీల్ చేయలేదు.