తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ రంగం చాలా కీలకమని పేర్కొన్నారు.
పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వెన్నెముక అని భట్టి విక్రమార్క తెలిపారు.అయితే గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను గాలికొదిలేసిందని మండిపడ్డారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డిస్కంలు అన్నీ అప్పుల్లో కూరుకుపోయాయని ఆరోపించారు.ఈ క్రమంలోనే డిస్కమ్ లకు రూ.28,673 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు.ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు.అలాగే విద్యుత్ రంగం అప్పు రూ.81,516 కోట్లు ఉందని ఆయన వెల్లడించారు.ఈ క్రమంలో విద్యుత్ పై వాస్తవాలు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు.