ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్( Salaar ) రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.హైదరాబాద్, కర్నూలు, మరికొన్ని ఏరియాలలోని ప్రముఖ థియేటర్లలో సలార్ ఫస్ట్ డే టికెట్లకు ఊహించని స్థాయిలో పోటీ నెలకొంది.
ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే సత్తా ఉన్న హీరో ప్రభాస్( Prabhas ) మాత్రమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
భాషతో సంబంధం లేకుండా ఈ స్థాయిలో క్రేజ్, ఈ రేంజ్ లో బుకింగ్స్ సలార్ కే సాధ్యమవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ సలార్ పీవీఆర్, మిరాజ్ థియేటర్లలో విడుదల కాకపోయినా సలార్ సినిమాకు మాత్రం నష్టం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ప్రభాస్ ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ కు( Prashanth Neel ) 15 సంవత్సరాల క్రితం వచ్చినా ఆలోచన ఆధారంగా సలార్ మూవీ తెరకెక్కింది.సలార్ మూవీ రికార్డులు క్రియేట్ చేసే మూవీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.సలార్ 1 క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని ప్రశాంత్ నీల్ చెబుతున్నారు.సలార్ సినిమాలో డ్రామా ఎక్కువగా ఉంటుందని ప్రశాంత్ నీల్ వెల్లడిస్తున్నారు.
సలార్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సలార్ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) రోల్ కూడా కీలకంగా ఉండనుందని తెలుస్తోంది.కథలో ఎమోషన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండటంతో ప్రభాస్, శృతి మధ్య సాంగ్ ప్లాన్ చేయలేదని ప్రశాంత్ నీల్ వెల్లడించారు.సలార్ సంచలనాలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
సలార్ మూవీని ఫస్ట్ డే థియేటర్లలో చూడటానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.