ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో చలరేగిపోతుంది.వరుస దాడులతో ఉక్రెయిన్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.ఈ క్రమంలో ఇప్పటికే వేల సంఖ్యలో సామాన్య పౌరులు, సైనికులు మృత్యువాతపడ్డారు.
ఇంత జరిగినా కూడా పుతిన్ మాత్రం దాడులను ఆపడం లేదు.ఉక్రెయిన్ కూడా అందుకు ధీటుగానే జవాబిస్తోంది.
తాజాగా ఉక్రెయిన్‌లోని జాతీయ రహదారిపై ఓ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎగురుతూ.వాహనదారులను భయాందోళనకు గురిచేసింది.దీనికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.దీనికి ‘వెల్‌కం టు ఉక్రెయిన్’ అని ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చింది.
ఈ వీడియోను ఒక్కసారి చూసినట్లయితే.ఉక్రెయిన్‌లోని ఓ జాతీయ రహదారిపై వాహనాలు వెళ్తున్నాయి.
అకస్మాత్తుగా ఓ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్తోంది.అప్పుడు హెలికాప్టర్‌కు దర్గర్లో ఓ కారు కూడా వెళ్తుంది.
కొంచెంలో ఆ కారును హెలికాప్టర్ ఢీ కొని ఉండేది.
కానీ పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు.
హెలికాప్టర్‌ను వెంటనే పక్కకు తీసుకున్నాడు.దీంతో ప్రమాదం తృటిలో తప్పింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకింగ్‌కు గురవుతున్నారు.
ఫైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోను ఇప్పటివరకు 1.2 మిలియన్ వీవ్స్ వచ్చాయి.
తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ రియాజాన్‌లోని సైనిక శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు.అక్కడ పుతిన్ స్నైపర్ రైఫిల్‌ను కాల్చాడు.కళ్లద్దాలు, చెవులకు రక్షణనిచ్చే పరికరాలను ధరించి కనిపించారు.
సైనికులు కాల్పులు జరిపే ఒక నెట్ లోపల ప్రవేశించి స్నైపర్ రైఫిల్‌ను పేల్చారు.ఈ కాల్పులు జరిపిన అనంతరం పుతిన్ చిరునవ్వు చిందించారు.