అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎపిక్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’.ఈ సినిమా మన ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం కూడా ప్లస్ అయ్యిందనే చెప్పాలి.బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.
అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.
ఇక ఇదే క్రేజ్ తో వీరిద్దరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు.ఇక ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు నాలుగేళ్ళ పాటు నిరీక్షించారు.
ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టింది.
ఇక ఈ సినిమా ఇక్కడే కాదు.వరల్డ్ వైడ్ గా కూడా మంచి హిట్ అయ్యింది.
ఇండియన్ సినిమా దగ్గర ఇంత క్రేజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు జపాన్ లో కూడా సంచలనం సృష్టిస్తుంది.

అక్కడ ఈ సినిమా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ క్రమంలోనే ఈ సినిమా అక్కడ కూడా మన దేశం గర్వించ దగ్గ మూమెంట్ చోటు చేసుకుంది.మరి మరో ప్రౌడ్ మూమెంట్ జరిగిన సందర్భం ఏంటంటే.
తాజాగా జపాన్ లో రిలీజ్ అయినా ఈ సినిమా అక్కడ మన దేశపు వందేమాతరం అక్షరాలు ఉన్న జెండా పట్టుకుని జపానీయులు కనిపించారు.ఇది మన దేశ గౌరవాన్ని పెంచింది.
దీనితో ట్రిపుల్ ఆర్ సినిమా మరోసారి మన దేశానికి ప్రౌడ్ మూమెంట్ తెచ్చిపెట్టింది.మరి దీనికి కారకులు ఎవరంటే ఖచ్చితంగా మన దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి అనే చెప్పాలి.







