భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవం(India’s 76th Republic Day) వేడుకలను ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.MTV మాత్రం ట్రెండింగ్ టాపిక్స్ పక్కన పెట్టి అసలైన విషయాలపై దృష్టి పెట్టమని యువతకు పిలుపునిచ్చింది.“ముఖ్యమైన ప్రశ్నలు అడగండి” అంటూ ఒక ఆలోచింపజేసే ప్రకటనను విడుదల చేసింది.ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రకటనలో ఒక చిన్న కుర్రాడు(Little boy) దేశంలోని సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ కనిపిస్తాడు.“మనం గొప్ప దేశం అని చెబుతారు కదా, మరి నా అక్కని అమెరికా ఎందుకు పంపిస్తున్నారు?” అని అమాయకంగా అడుగుతాడు.ఆ తర్వాత దేశంలో ఇంత అందం ఉన్నా ఎందుకు చాలామంది భారతీయులు విదేశాలకు వెళ్తున్నారని ప్రశ్నిస్తాడు.కానీ అతని తల్లి మాత్రం ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది.
న్యూస్ పేపర్ చూస్తూ “ఇంతమంది ఇంజనీర్లు ఉన్న మన దేశంలో రోడ్లు ఎందుకు సరిగ్గా లేవు?” అని అడుగుతాడు.అంతే, తల్లి(Mother) వెంటనే ఆ పేపర్ ని చింపేసి, పేపర్ ప్లేన్స్ చేసి ఆడుకుంటూ ప్రశ్నను దాటవేస్తుంది.ఇక్కడితో ఆగకుండా, ఆ కుర్రాడు మరింత లోతుగా వెళ్తాడు.ఇంట్లో బీరువాలో కట్టలు కట్టలుగా డబ్బు ఎందుకు దాచారని, నాన్న పోలీసులకు లంచం ఇచ్చారా అని సూటిగా అడుగుతాడు.
ఇంటి పనిమనిషికి వేరే గ్లాసు ఎందుకు వాడుతున్నారో కూడా ప్రశ్నిస్తాడు.చివరగా ఉల్లిపాయల ధరలు ఎందుకు మండిపోతున్నాయో తెలుసుకోవాలనుకుంటాడు.
అయితే, ఈ ప్రశ్నలన్నిటికీ సైలెంట్‌గా ఉన్న తల్లి, ఒక్కసారిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్(Bollywood star Saif Ali Khan) కొడుకు తైమూర్ గురించి మాట్లాడేసరికి మాత్రం రియాక్ట్ అవుతుంది.చివరికి, ప్రకటన ఒక బలమైన సందేశంతో ముగుస్తుంది: “ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతూనే ఉండండి”.
సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చిన అద్భుతమైన ప్రకటన అని ప్రశంసించారు.చాలా మంది సోషల్ మీడియా యూజర్లు MTVని అభినందిస్తున్నారు.“మీరు అధికారంలో ఉన్నవారిని సరైన ప్రశ్నలు అడిగినప్పుడే మీ బాధ్యతను నెరవేర్చినట్లు” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.మరొకరు ఈ యాడ్ “చాలా బాగుంది, సమాచారంతో నిండి ఉంది” అని మెచ్చుకున్నారు.
ఇంకొకరు బాలీవుడ్ గురించి అడిగిన ప్రశ్న తప్ప ప్రతి ప్రశ్న రాజకీయ నాయకులను అర్థవంతమైన మార్పులు చేయడానికి పురిగొల్పుతుంది.ప్రశ్నలు అడుగుతూనే ఉండండి.” అని అభిప్రాయపడ్డారు.