మహా కుంభమేళా ( Maha Kumbh Mela )ఈ సంవత్సరం ఎన్నో ప్రత్యేక క్షణాలకు వేదికైంది.ఈ పర్వదినాన ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు.
ఒకరు ఐఐటీ చదివిన బాబా అభయ్ సింగ్, ( Abhay Singh )మరొకరు పూలదండలు అమ్మే మోనాలిసా. మోనాలిసా( Mona Lisa ) అందం చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
ఆమె రాత్రికి రాత్రే సెన్సేషన్ గా మారిపోయింది.
అయితే, మోనాలిసా మహా కుంభమేళాలో పూలు అమ్ముతూ కేవలం పది రోజుల్లోనే రూ.10 కోట్ల సంపాదించిందని పుకార్లు షికార్లు చేశాయి.ఆమె ముత్యాలు, రుద్రాక్షలు కలిపిన దండలు లక్షల రూపాయలకు అమ్మిందట.
దీంతో సోషల్ మీడియా మొత్తం ఆమె సంపాదన గురించే చర్చించుకుంది.కానీ మోనాలిసా ఈ పుకార్లను కొట్టిపారేసింది.
“నేను అంత డబ్బు సంపాదిస్తే, ఇంకా ఇక్కడే దండలు అమ్ముకుంటూ ఎందుకు ఉంటాను?” అని ఆమె ప్రశ్నించింది.

మోనాలిసాకు విపరీతమైన ఫేమ్ వచ్చినా, ఆమె చాలా కష్టాలు ఎదుర్కొంది.ఒక వీడియోలో ఆమె తండ్రి మాట్లాడుతూ, ఈ ఫేమ్ వల్ల తమ వ్యాపారం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశాడు.చాలామంది ఆమెతో సెల్ఫీలు దిగడానికి వచ్చేవారు కానీ దండలు మాత్రం కొనేవారు కాదు అని ఆయన వాపోయాడు.ఆమె పాపులారిటీ పెరగడంతో భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది.
మహా కుంభమేళాలో పెద్ద గుంపు ఆమె వెంటపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ అనవసరమైన హడావిడితో ఆమెను చాలామంది వేధించారు.
యూట్యూబర్లు, సందర్శకులు ఫొటోలు, ఇంటర్వ్యూల( YouTubers, visitors photos, interviews ) కోసం ఆమెను చుట్టుముట్టడంతో పరిస్థితి మరింత దిగజారింది.

చివరికి మోనాలిసా తన భద్రత, కుటుంబం క్షేమం కోసం మహా కుంభమేళాను విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది.వెళ్లే ముందు ఆమె “నా భద్రత కోసం, నా కుటుంబం కోసం నేను తిరిగి ఇండోర్ వెళ్తున్నాను.కుదిరితే వచ్చే మహా కుంభమేళాలో పవిత్ర స్నానం కోసం మళ్లీ వస్తాను.మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు.” అని తెలిపింది.








