టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu )బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను ఏప్రిల్ 16 వ తేదీకి సుప్రీంకోర్టు( Supreme Court ) వాయిదా వేసింది.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో( Skill Development Scam Case ) చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసినప్పుడు తమ వాదనలను, ఆధారాలను హై కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ పిటిషన్ లో పేర్కొంది.
అదేవిధంగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కూడా హైకోర్టు పట్టించుకోలేదని సీఐడీ పిటిషన్ లో పేర్కొంది.