Ravikishan : మా నాన్న నన్ను చంపాలనుకున్నాడు.. రేసుగుర్రం విలన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ రోల్స్ ద్వారా రవికిషన్( Ravikishan ) ఊహించని స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు.రవికిషన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.

 Artist Ravikishan Comments About His Father Details Here Goes Viral In Social M-TeluguStop.com

అయితే మా నాన్న నన్ను చంపాలనుకున్నాడంటూ రవికిషన్ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

మా నాన్నకు ఎమోషన్స్ చాలా తక్కువని నన్ను దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టేవాడని రవికిషన్ చెప్పుకొచ్చారు.

ఒకానొక టైమ్ లో నాన్న నన్ను చంపాలని అనుకున్నాడని ఆయన కామెంట్లు చేశారు.ఆ విషయం అమ్మకు అర్థమై పారిపోవాలని చెప్పిందని ఆయన వెల్లడించారు.500 రూపాయలతో ఇంటి నుంచి వచ్చేశానని రైలు ఎక్కి ముంబై చేరుకున్నానని రవికిషన్ వెల్లడించారు.

Telugu Racegurram, Ravikishan, Supreme, Tollywood, Villain-Movie

మా నాన్న కోపంలో అర్థముందని మాది సాంప్రదాయ కుటుంబం అని రవికిషన్ తెలిపారు. నాన్న వ్యవసాయం( My father was farmer ) లేదా ప్రభుత్వ ఉద్యోగం చేయమని సూచించారని రవి కిషన్ చెప్పుకొచ్చారు.తన కుటుంబంలో ఒక నటుడు పుడతాడని నాన్న ఎప్పుడూ అనుకోలేదని రవికిషన్ కామెంట్లు చేశారు.

రామ్ లీలా నాటకంలో నేను సీతగా నటించడంతో నన్ను బాగా కొట్టారని రవికిషన్ వెల్లడించారు.

Telugu Racegurram, Ravikishan, Supreme, Tollywood, Villain-Movie

ఈ భూమి మీద నుంచి వెళ్లే సమయంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని బాల్యంలోనే ఫిక్స్ అయ్యానని ఆ ఆశతోనే నటుడిగా మారానని రవికిషన్ తెలిపారు.బాల్యంలో నన్ను బాగా కొట్టినందుకు నాన్న చివరి రోజుల్లో బాధ పడ్డాడని రవికిషన్ వెల్లడించారు.నువ్వే మా గర్వ కారణం అని నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారని రవికిషన్ పేర్కొన్నారు.

రవికిషన్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.రేసుగుర్రం, సుప్రీం( Racegurram, Supreme ) సినిమాలు రవికిషన్ రేంజ్ ను పెంచాయి.

రవికిషన్ పారితోషికం ఒకింత భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube