రామ్ గోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున( Ram Gopal Varma, Akkineni Nagarjuna ) కాంబినేషన్‌లో వచ్చిన “శివ” సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యింది.ఈ మూవీ తర్వాత నాగార్జునతో పాటు రామ్ గోపాల్ వర్మ తమ కెరీర్ లైఫ్ లో వెను తిరిగి చూసుకోలేదు.
ఈ మూవీ వచ్చి మూడు దశాబ్దాలకు పైగానే సమయం గడుస్తోంది.అయినా దీని గురించి ఇప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులు మాట్లాడుకుంటారంటే దాని గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
“శివ’ ( Shiva )సినిమాకి ముందు ‘రావుగారిల్లు’, ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ వంటి సినిమాల టెక్నికల్ టీంలో పని చేసి వర్మ కనెక్షన్స్ పెంచుకున్నాడు.ముఖ్యంగా అక్కినేని నాగార్జున వర్మ వింత క్యారెక్టర్, తెలివి చూసి అతడితో ఫ్రెండ్‌షిప్ చేశాడు.
మంచి కథ తీసుకొని వస్తే తనతో సినిమా తీస్తానని కూడా మాటిచ్చాడు.ఆ మాట ప్రకారమే నాగార్జున వర్మతో సినిమా తీసేనందుకు ఒప్పుకున్నాడు.అయితే అన్నపూర్ణ స్టూడియోస్( Annapurna Studios ) ఓనర్లైన అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర వర్మ కొత్త దర్శకుడు అని అతడితో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు.వాళ్ళిద్దరూ ఒప్పుకోకుండా నాగార్జున సినిమా చేసే అవకాశం లేదు.

దాంతో రామ్ గోపాల్ వర్మకి ఏం చేయాలో అర్థం కాలేదు.దాంతో నాగార్జునకు, అన్నపూర్ణ స్టూడియోస్ ఓనర్లకు అబద్ధాలు చెప్పి ఈ మూవీని ఎలాగైనా పట్టాలు ఎక్కించాలని రామ్ గోపాల్ వర్మ అనుకున్నాడు.ఆ సమయంలో కోదండరామిరెడ్డితో నాగార్జున సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.ఒకరోజు రామ్ గోపాల్ వర్మ, గణేష్ పాత్రో, కోదండరామిరెడ్డి కలిసి స్టోరీ డిస్కషన్స్‌లో పాల్గొన్నారు.తర్వాత స్టోరీ ఫైనలైజ్ చేశారు.దానిని చెన్నైలో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు కి ఏం చెప్పాలని రామ్ గోపాల్ వర్మ అనే పంపించారు.
అయితే ఈ కథ నచ్చితే అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున తోటి ఈ సినిమా చేయమని చెప్పేస్తారు.అప్పుడు నాగార్జున సినిమా తీసి తర్వాత నెక్స్ట్ సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోయే అవకాశం ఉంది.

దానివల్ల తనతో సినిమాలు తీసే అవకాశం రాదని రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడు.అందుకే చెన్నైకి వెళ్ళాక వినిపించాల్సిన కథను అటూ ఇటూ మార్చేసి చెప్పాడు.దీనివల్ల ఏఎన్ఆర్ కు కథ నచ్చలేదు.కథ నచ్చలేదు అని చెప్పు అని రాంగోపాల్ వర్మ ని మళ్ళీ తిరిగి నాగార్జున వద్దకు పంపించాడు.అదే విషయాన్ని రామ్ గోపాల్ వర్మ చెప్పాడు.దానివల్ల రెండు నెలలు నాగార్జునకు ఖాళీ డేట్స్ వచ్చాయి.
ఈ ఖాళీ సమయంలో తనతో సినిమా చేయాలని ఆర్జీవి నాగార్జునను బతిమిలాడాడు.ఎలాగూ ఖాళీగా ఉంటున్నాం కదా ఆర్జీవికి లైఫ్ ఇద్దామని నాగార్జున ఒప్పుకున్నాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ ఓనర్లు సైతం రామ్ గోపాల్ వర్మపై మంచి ఇంప్రెషన్ ఉండటంతో ఓకే అని చెప్పేసారు ఆ విధంగా రాంగోపాల్ వర్మ ఒక అబద్ధం చెప్పి శివ సినిమా ప్రారంభమయ్యేలా చేయగలిగాడు ఈ విషయాన్ని అతడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.