ఇటీవల కాలంలో వధూవరులు ప్రీ వెడ్డింగ్ షూట్( Pre-wedding shoot ) పేరిట చిత్ర విచిత్రమైన చేష్టలు చేస్తున్నారు కొందరు బురద బొర్లితే మరికొందరు నగ్నంగా ఫోటోలు దిగుతూ షాక్‌లు ఇస్తున్నారు.డ్యూటీ చేస్తూ ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరిపే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.
తాజాగా కర్ణాటక ( Karnataka )రాష్ట్రంలోని జిల్లా చిత్రదుర్గలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించాడు.దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు.
అది వైరల్ అయి ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో వారు అతడిని ఉద్యోగం నుంచి తీసేసారు.పెళ్లికి ముందు ఆపరేషన్ థియేటర్‌లో కాబోయే భార్యతో కలిసి ఫోటోషూట్ చేశాడు.
ఈ ఫోటోషూట్‌ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.అది చూసి చాలా మందికి కోపం వచ్చింది.వైద్యుడు తన పనిపై సీరియస్‌గా వ్యవహరించడం లేదని, ఆసుపత్రిని, రోగులను అగౌరవపరుస్తున్నాడని వారు తిట్టి పోశారు.వీడియోలో, డాక్టర్, అతని కాబోయే భార్య రోగికి ఆపరేషన్ చేస్తున్నట్లు నటించడం మనం చూడవచ్చు.
వారు నిజమైన వైద్య సాధనాలను ఉపయోగించారు, చుట్టూ బ్రైట్ లైట్లను కూడా సెటప్ చేశారు.ఈ వెడ్డింగ్ షూట్ ను చిత్రీకరిస్తున్న వారు చాలా నవ్వడం కూడా మనం గమనించవచ్చు.
చివరికి పేషెంట్ కూడా లేచి నవ్వడంతో వీడియో ముగుస్తుంది.
ఫోటోషూట్‌లో మెడికల్ థీమ్ ఉంది, ఎందుకంటే డాక్టర్, అతని కాబోయే భార్య ఇద్దరూ తెల్లటి కోట్లు, ముసుగులు ధరించారు.అయితే సరదా సరదాలా కనిపిస్తున్నా వీరు ఆసుపత్రి నిబంధనలు పాటించడం లేదు.కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఈ వీడియోను చూసి చాలా బాధపడ్డారు.
వెంటనే డాక్టర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.ప్రభుత్వ ఆసుపత్రులు( Government hospitals ) వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించరాదని, అవి ప్రజలకు సహాయం చేయడానికేనని అన్నారు.
ఏ వైద్యుడూ అలా ప్రవర్తించడాన్ని తాను అనుమతించబోనని స్పష్టం చేశారు.వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది అందరూ సక్రమంగా విధులు నిర్వహించాలని మంత్రి ట్విట్టర్‌లో సూచించారు.
ఆసుపత్రి సౌకర్యాలు దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి చెప్పినట్లు తెలిపారు.