ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టపడే డ్రింక్స్‌లో కాఫీ( Coffee ) ఒకటి.తమ చేతుల్లో వెచ్చని కప్పును పట్టుకుని, కాఫీ తాగే ముందు దాని వాసనను ఎంజాయ్ చేస్తూ తాగడం చాలామందికి ఇష్టం ఉంటుంది.
అయితే ఎప్పుడూ ఇలానే కాకుండా కాఫీని కొత్తగా ట్రై చేసే మార్గాలను కొన్ని కేఫ్‌లు అందిస్తున్నాయి.ఈ మార్గాలలో కాఫీని ఐస్‌క్రీమ్ కోన్‌లో సర్వ్ చేయడం ఒకటి.
ఈ కోన్ స్వీట్‌గా ఉంటే విభిన్నమైన కప్పు.దీనిని తినేయవచ్చు.
ఈ స్పెషల్ కాఫీకి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.వీడియోలో కనిపించినట్లు సాధారణ కప్పు లేదా మగ్‌కు బదులుగా, కేఫ్ సిబ్బంది వాఫిల్, చాక్లెట్‌తో చేసిన కోన్‌ను ఉపయోగించారు.
ఆపై కోన్‌లో కాఫీ పోసి, నురుగు పైన చక్కటి డిజైన్ తయారు చేశారు.వీడియోకు 70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.“ఐస్‌క్రీమ్ కోన్‌లో( Icecream Cone ) కాఫీ ఎవరికి కావాలి?” అని దీనికి ఒక క్యాప్షన్ జోడించారు.
అయితే కోన్ నుంచి కాఫీ లీక్ అవుతుందా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు.అయితే కోన్ లోపల ఉన్న చాక్లెట్ కాఫీ లీక్ కాకుండా ఆపుతుందని వీడియో వివరించింది.దీనిని ప్రయత్నించిన ఒక వ్యక్తి, “ఇది అస్సలు లీక్ అవ్వదు, నేను చాలా స్లోగా దీన్ని తాగాను, అయినా చుక్క కూడా లీక్ కాలేదు.” అని తెలిపాడు.
కాఫీ తాగడానికి కాఫీ ఐస్‌క్రీం కోన్ మంచి మార్గం కాదని కొందరు అనుకోవచ్చు.అయితే ఇది కాఫీ తాగే అనుభూతిని ఆహ్లాదకరంగా మారుస్తుందని మరికొందరు అంటున్నారు.కాఫీలో చాక్లెట్ కరుగుతూ దాని రుచిని అద్భుతంగా మారుస్తుందని కొందరు పేర్కొన్నారు.
కాఫీ ఐస్ క్రీమ్ కోన్ ఆలోచన దక్షిణాఫ్రికా( South Africa )లోని ది కాఫీ గ్రైండ్ కంపెనీ అనే ప్రదేశం నుంచి వచ్చింది.దీన్ని తయారు చేసిన వ్యక్తి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయే టేస్ట్ ఆఫర్ చేయాలనుకున్నాడు.
అందుకే అందులో చాక్లెట్ కూడా యాడ్ చేశాడు.