సినిమా ఇండస్ట్రీలో ఏరోజు ఎవరు ఏ స్థానంలో ఉంటారో ఎవరు చెప్పలేరు.ఈరోజు స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్న వారే రేపు అవకాశాలు లేకుండా ఉండొచ్చు.
ఈ రోజు చిన్న చిన్న పాత్రలు చేస్తున్నవారు.రేపు స్టార్లుగా ఎదగవచ్చు.
అందువల్లే ఇండస్ట్రీలో ఏది శాశ్వతం కాదు అని అందరూ చెబుతూ ఉంటారు.ఇక ఇది ఇలా ఉంటే రాజకుమారుడు సినిమా తో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు( Mahesh Babu ) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమాతో మంచి విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.

ఇక దాంతో అప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన సురేష్ కృష్ణ( Director Suresh Krishna )తో మహేష్ బాబు ఒక సినిమా చేయాలనుకున్నాడు.ఇక అందులో భాగంగానే మహేష్ బాబు అతన్ని కలిసి మన కాంబో లో ఒక సినిమా చేద్దామని అడిగినప్పటికీ ఆయన నేను చాలా బిజీగా ఉన్నాను.స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు నీతో సినిమా చేయడం కష్టమని చెప్పాడట.
దాంతో మహేష్ బాబు అప్సెట్ అయినట్టుగా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి.ఇక ఈ విషయం తెలుసుకున్న కృష్ణ కూడా సురేష్ కృష్ణ ను అదిగిన కూడా ఇప్పుడు మహేష్ తో సినిమా చేయడం కష్టమని ఆయన చెప్పాడట.
దాంతో ఎస్ జే సూర్య( SJ Surya ) డైరెక్షన్ లో మహేష్ బాబు నాని( Nani ) అనే సినిమా చేసి భారీ ఫ్లాప్ ని అందుకున్నాడు.

ఆ తర్వాత అతడు, పోకిరి( Pokiri ) లాంటి సినిమాలు చేసి ఇండస్ట్రీలో తను స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.మహేష్ బాబు స్టార్ హీరో అయిన తర్వాత సురేష్ కృష్ణ వెళ్లి మహేష్ బాబు తో సినిమా చేయడానికి ట్రై చేశాడట.కానీ అప్పుడు మహేష్ బాబు ఇప్పుడు సినిమా చేయడం కష్టం అని చెప్పినట్టు గా అప్పట్లో మీడియా లో చాలా కథనాలు వచ్చాయి.
అయితే ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయంటూ సినీ పెద్దలు సైతం వీటి మీద అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు…
.