Telangana Cabinet Meeting : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం( Telangana Cabinet Meeting ) జరగనుంది.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3.30 గంటలకు సెక్రటేరియట్ లో మంత్రివర్గం భేటీ కానుంది.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై( Assembly Budget Meetings ) ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.

 Telangana Cabinet Meeting : నేడు తెలంగాణ కేబిన-TeluguStop.com

కుల గణనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.అదేవిధంగా వాహనాల నంబర్ ప్లేట్ లలో టీఎస్ కు బదులు టీజీగా మారుస్తూ ఆమోదం తెలపనుంది.

దాంతో పాటు ఆరు గ్యారెంటీల్లో భాగంగా రెండు హామీలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్( Revanth Reddy Government ) మరో రెండు హామీలను అమలు చేసే యోచనలో ఉంది.

ఈ నేపథ్యంలో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్( Free Power ) తో పాటు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించేందుకు రంగం సిద్ధం చేస్తుంది.అలాగే ఐటీ రంగం, గ్రూప్ -1 నోటిఫికేషన్ వంటి పలు అంశాలపై కేబినెట్ చర్చించనుందని సమాచారం.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలుస్తోంది.

కాగా ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించే తేదీలను ఖరారు చేయనున్నారు.ఈ క్రమంలోనే ఈనెల 8వ తేదీ నుంచి దాదాపు ఐదు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube