హైదరాబాద్ లోని సికింద్రాబాద్( Secunderabad ) లో కత్తిపోట్ల కలకలం చెలరేగింది.సికింద్రాబాద్ లోని రెండు ప్రాంతాల్లో యాచకులపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు.
దుండగుల దాడిలో ఒకరు మరణించగా.మరొకరు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.
మోండా మార్కెట్( Monda Market ) మరియు మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ముగ్గురు దుండగులు ఈ దాడులకు పాల్పడ్డారని సమాచారం.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.