ఫోటోగ్రఫీ( Photography ) బాగా నేర్చుకుంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కూడా చూపించవచ్చు.మామూలు పూరి గుడిసెలో ఉన్నా సరే విమానంలో ప్రయాణించినట్లు పోజులు ఇవ్వచ్చు.
ఇంకా భూమిపై ఉండే ఆకాశంలో ఉన్నట్లు కూడా ఒక ఫోటో తీసుకోవచ్చు.తాజాగా ఇలాంటి ఫోటోగ్రఫీ ట్రిక్స్ కి ( Photography Tricks ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి టీవీ స్క్రీన్( TV Screen ) ముందు పెట్టిన ఆయిల్ క్యాన్ హోల్డర్ గ్యాప్ లో నుంచి టీవీ ఫోటో తీయడం మనం చూడవచ్చు.దీని ఫలితంగా విమానం విండో సీటు పక్కన కూర్చుని మేఘాలను ఫోటో తీసిన ఎఫెక్ట్ కలిగింది.తర్వాత ఒక బ్యూటిఫుల్ మంచు ప్రదేశంలో హాట్ డ్రింక్ తాగుతూ బైనాక్యులర్ లో( Binoculars ) చూసినట్లు క్రియేట్ చేయడానికి మరో ట్రిక్ ఉపయోగించడం మనం చూడవచ్చు.టీవీ స్క్రీన్ ముందు కూర్చొని ఈ పని చేశారు.
ఆ తర్వాత ఒక గ్లాస్ బౌల్ తలకి ధరించి ఆస్ట్రోనాట్( Astronaut ) వలె ఫోటో దిగిన కనిపించే మరొక హ్యాక్ మనం చూడవచ్చు.వీడియో ముందుకెళ్తున్న కొద్దీ ఇలా ఇంట్లో కూర్చుని ప్రకృతి ప్రదేశాల్లో ఫొటోలు దిగినట్లు ఫోజులు ఇచ్చారు.అవి చూసేందుకు చాలా రియల్లిస్టిక్ గా కూడా ఉన్నాయి.ఇన్‌స్టాగ్రామ్ కొందరు ఇలాగే షో ఆఫ్ చేస్తారని దీనికి సరదాగా ఒక క్యాప్షన్ జోడించారు.ఈ వీడియోను @HumansNoContext ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.షేర్ చేసిన సమయం నుంచి దీనికి 59 లక్షల వ్యూస్ వచ్చాయి.