సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైనటువంటి కథ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి.కొన్ని సమాజానికి స్ఫూర్తి కలిగించే సినిమాలు రాగా మరికొన్ని చెడు సందేశాలను అందిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి.
ఇలా ఎన్నో సినిమాలు ద్వారా చాలామంది స్ఫూర్తిని తీసుకొని మంచి చేసినవారు అలాగే చెడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది చెడు అలవాట్లకు బానిసలుగా మారినటువంటి వారు కూడా ఉన్నారు.కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చెడు సందేశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ హిట్ అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి మరి ఆ సినిమాలు ఏంటో ఓ లుకేసేద్దాం.
ఇడియట్: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ( Ravi teja ) రక్షిత ( Rakshitha ) హీరో హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాలో అమ్మాయిల మనోభావాలతో ఇష్టం లేకుండా హీరో తన వెంట పడుతూ తనకు ముద్దు పెట్టమని తనని హగ్ చేసుకోమని వేధించారు.
అయితే ఈ ట్రెండ్ యూత్ ను ఆకర్షించి వారు కూడా ఫాలో అవుతూ ఇప్పటికీ అమ్మాయిలను వేధిస్తున్నారని చెప్పాలి.
పోకిరి: పూరి డైరెక్షన్లో మహేష్ బాబు( Mahesh Babu ) ఇలియానా( Ileana ) నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఇందులో పండుగాడు పాత్రలో మహేష్ బాబు ఊర మాస్ లుక్ లో కనపడుతూ రౌడీలను చితక బాదుతూ ఉంటారు అయితే ఈయన కృష్ణ మనోహర్ పాత్రలో కూడా నటించారు కానీ చాలామంది కృష్ణ మనోహర్ పాత్రను కాకుండా పండు పాత్రను అనుసరిస్తూ ఉన్నారు.
ఖతర్నాక్: ఇలియానా( Ileana ) రవితేజ ( Raviteja ) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రవితేజ స్టూడెంట్ పాత్రలో నటించగా ఇలియానా టీచర్ పాత్రలో నటించారు గురువుల్ని గౌరవించాలి అని సమాజానికి తెలియజేయాల్సింది పోయి విద్యార్థులు గురువులను ఏ విధంగా హింసిస్తారు ఏ విధంగా తనని ప్రేమలో పడేస్తారు అన్న అంశం ద్వారా ఈ సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
అర్జున్ రెడ్డి: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా విడుదల సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది.ఈ సినిమాలో హీరో నటించిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోయిన్ తో శృతి మించిపోయి రొమాంటిక్ సన్నివేశాలలో నటించడంతో సమాజానికి చెడు సందేశాన్ని అందించడమే అని చెప్పాలి.
పుష్ప: డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) రష్మిక( Rashmika ) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎలాంటి సెన్సేషనల్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమాలో స్మగ్లింగ్ చేసే వ్యక్తులను హీరోలుగా చూపించి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీసులను విలన్లుగా చేసి చూపించారు.
ఇలా స్మగ్లింగ్ చేయడం కూడా ఒక చెడు సందేశాన్ని యువతకు పరిచయం చేసినట్లే అవుతుంది కానీ ఈ సినిమా మాత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బాస్టర్ కావడం విశేషం.