నెల్లూరుకి చెందినటువంటి ఆదిరెడ్డి (Aadi Reddy) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక చిన్న కంపెనీలో ఇంజనీర్ గా చాలీచాలని జీతంతో పని చేసేవారు.ఇలా ఇంజనీర్ గానే కొనసాగుతూ యూట్యూబ్లో రివ్యూలు అలాగే పలు వీడియోలు పోస్ట్ చేసేవారు.
అయితే ఈయన ఇచ్చే రివ్యూలకు ఎంతో మంచి ఆదరణ రావడంతో ఈయనకు యూట్యూబ్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు.ఇలా యూట్యూబ్ ద్వారా మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈయన తన జాబ్ కూడా మానేసి యూట్యూబ్ వీడియోల ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.
ముఖ్యంగా బిగ్ బాస్ రివ్యూలకు(Bigg Boss Review) ఎంతో మంచి ఆదరణ లభించడంతో ఈయన కూడా ఒక సెలబ్రిటీగా మారిపోయారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమానికి రివ్యూ ఇస్తూ ఈయన కూడా గత సీజన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఆదిరెడ్డికి యూట్యూబ్లో మరింత ఫాలోవర్స్ పెరిగిపోయారు.ఇలా యూట్యూబ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం వస్తుందని చెప్పాలి.
ఇలా యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఆదిరెడ్డి క్రమక్రమంగా బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.ఈయన తాజాగా సెలూన్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు.విజయవాడలో(Vijayawada) ప్రముఖ సెలూన్ కంపెనీ జావేద్ హబీబ్(Jawed Habib) బ్రాంచ్ తీసుకొని ప్రారంభించాడు.ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి సింగర్,
రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.అయితే ఈయన గతంలో బార్బర్ గా చేసిన సంగతి తెలిసిందే.ఇలా ఈ సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాహుల్ హాజరు కావడంతో ఆదిరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ తాను ప్రారంభిస్తున్నటువంటి మొట్టమొదటి బిజినెస్ తన చేతుల మీదుగా ప్రారంభమైందని ఇలా ప్రారంభించినందుకు చాలా కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు.ఇక ఈ బిజినెస్ ద్వారా కొంతమందికి ఉపాధి కూడా కల్పించబోతున్నానని తెలిపారు.
ఈ సెలూన్ లో దాదాపు 15 మంది వర్కర్లు పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆదిరెడ్డి తన బిజినెస్ గురించి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.