కౌంటింగ్ సెంటర్ వద్ద జిల్లా ,కేంద్ర పోలీస్ బలగాలతో మూడేంచేలా విధానంతో పటిష్ట పహారా..

రాజన్న సిరిసిల్ల జిల్లా :రేపు జరగబోయే కౌంటింగ్ సందర్భంగా పోలీస్ పరంగా ఎలాంటి సంఘటనవు జరగకుండా కేంద్ర బలగాలు, ఆర్ముడ్ రిజర్వ్ బలగాలు, స్థానిక పోలీస్ బలగాలతో మూడేంచేలా విధానంలో పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టడం జరిగిందని, కౌంటింగ్ సెంటర్ వద్ద, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సిరిసిల్ల, వేములవాడ( Sirisilla, Vemulawada ) నియోజకవర్గలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపధ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) పోలీస్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి భద్రత పరంగం తీసుకోవలసిన పలు చర్యలపై సూచనలు చేశారు.

 Strong Security At Counting Center With District And Central Police Forces, Sir-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తేదీ: 03-12-2023 నాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున గ్రామాలలో పట్టణాలలో , మండలాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు గాను తేదీ: 03-12-2023 ఉదయం 6:00 నుండి తేదీ: 04-12-2023 ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

కౌంటింగ్ సెంటర్ వద్ద, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురు కానీ అంతకంటే ఎక్కువమంది కానీ గుంపులు గుంపులుగా తిరగవద్దని, పార్టీ జెండాలు, పార్టీ కండువాలు, గుర్తులు, ఫ్లా కార్డ్స్ ధరించవద్దు ప్రదర్శించవద్దని,మైకులు, లౌడ్ స్పీకర్లు,ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులకు,అనుమతి లేదన్నారు.

ఎన్నికల కౌటింగ్ పక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించలన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని, ఎలక్షన్ కమిషన్( Election Commission ) జారి చేయబడిన గుర్తింపు కార్డ్ లను కలిగి ఉండాలని,గుర్తింపు కార్డ్ లను కలిగి ఉన్నవారిని మాత్రమే కౌంటీగ్ కేంద్రలోకి అనుమతించడం జరుగుతుందన్నారు.

ఎస్పీ వెంట డిఎస్పీ ఉదయ్ రెడ్డి,స్పెషల్ బ్రాంచ్ సి.ఐ అనిల్ కుమార్, ఎస్.ఐ వెంకటేశ్వర్లు, పృథ్విదర్ గౌడ్, పోలీస్ సి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube