ఎన్ఎస్పీ అధికారులు నిర్లక్ష్యంతో పంట నీటి పాలు...!

సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలో ఎన్ఎస్పి కెనాల్ గేటు తెగి నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి విడుదలైన నీళ్లు పొలాల్లోకి మళ్ళడంతో వందల ఎకరాల్లో వరి పంట నీటి పాలైంది.ఈ ఖరీఫ్ సీజన్లో సరైన సమయానికి నీటి విడుదల చేయక,వర్షాలు సకాలంలో పడక ఎడమ కాలువ ఆయకట్టు కింద వేలాది ఎకరాల్లో క్రాప్ హాలీ డే ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Crops Were Watered Due To The Negligence Of The Nsp Officials, Crops , Negligenc-TeluguStop.com

బోర్లు,బావులను నమ్ముకొని కొద్దిమంది సాగు చేస్తే 24 గంటల కరెంట్ సక్రమంగా ఇవ్వక,

చాలా వరకు పొట్ట దశలో పొలాలు ఎండిపోయి అన్నదాతలు ఆగమయ్యారు.కష్టపడి కాపాడుకున్న పంట కూడా కోతకొచ్చిన సమయంలో ఎన్ఎస్పి అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీళ్లపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే జరగాల్సిన నష్టం జరిగాక సోమవారం ఎడమ కాలువకు అధికారులు నీటి విడుదల నిలిపి వేసినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube