స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
విచారణలో భాగంగా సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు.ఇది ప్రతీకార కేసు కాదని ఆయన కోర్టుకు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలోనే స్కిల్ డెవలప్ మెంట్ కేసు ప్రారంభమైందని గుర్తు చేశారు.ప్రాజెక్టు విలువ రూ.36 కోట్లు అయితు వేల కోట్లుగా చూపించారని సీఐడీ తరపు న్యాయవాదులు తెలిపారు.దోచుకున్న డబ్బంతా హవాలా మార్గంలో హైదరాబాద్ చేరిందని ఆరోపించారని తెలుస్తోంది.అలాగే ఫోరెన్సిక్ ఆడిట్ కూడా రూ.241 కోట్లు దారి మళ్లినట్లు నిర్ధారించిందని సీఐడీ తరపు లాయర్లు వాదనలు వినిపించారు.ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.