యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”( Devara ).ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియన్ మూవీ తర్వాత గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు.
దీంతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.అందుకే ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలపై కూడా భారీ క్రేజ్ పెరిగింది.
ప్రజెంట్ ఎన్టీఆర్( Junior NTR ) నటిస్తున్న దేవర సినిమా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.ఈయనకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని కొరటాల కూడా భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు.ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ ను ఈ సినిమాలో ఎక్కువుగా భాగం చేస్తూ ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.
కొన్ని నెలలుగా గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ సోమో,ఆ తాజాగా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఇక విడుదలకు ఇంకా 150 రోజులు మాత్రమే ఉందని కొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.”భయానికి మరో పేరే దేవర.150 రోజుల్లో పెద్ద స్క్రీన్ లలో అత్యంత భారీ ప్రదర్శనను చూసేందుకు సిద్ధంగా ఉండండి.కౌంట్ డౌన్ షురూ.
అంటూ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసారు.ఇందులో ఎన్టీఆర్ రెండు చేతులతో ఆయుధాలు పట్టుకుని.
నీళ్లలో రాయి మీద నిలబడి కనిపిస్తున్నారు.మొత్తానికి కొరటాల ఈ సినిమాను ఎలా ప్లాన్ చేసాడో చూడాలి.
అన్నట్టు ఇది రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే.మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ కానుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.