బడా నేతలు.. బడా కన్ఫ్యూజన్?

తెలంగాణ బీజేపీ( Telangana BJP ) ప్రస్తుతం కన్ఫ్యూజన్ లో మునిగితేలుతోంది.ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికి ఇంకా పార్టీలోని అనిశ్చితి వ్యవహారాలు ఓ కొలిక్కి రావడం లేదు.

 Confusion Among Kishan Reddy Bandi Sanjay Etela Rajender Over Cm Candidate Detai-TeluguStop.com

సీట్ల కేటాయింపులో ఇప్పుడిప్పుడే సర్దుబాటు జరుగుతుండగా.ఇప్పుడు మరో సమస్య ఆ పార్టీ అధినాయకులను వెంటాడుతోంది.

ఎన్నికల ముందే సి‌ఎం అభ్యర్థిని( CM Candidate ) ఎన్నుకొని ప్రచారానికి వెళ్లలా ? లేదా ఎన్నికల్లో ఫలితాలను బట్టి సి‌ఎం అభ్యర్థి విషయంలో ఆలోచించలా అనే కన్యూజన్ ఆ పార్టీ అధిష్టానంలో నెలకొన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం పార్టీ నుంచి ముగ్గురు నేతలు సి‌ఎం అభ్యర్థి రేస్ ,లో ఉన్నారు.

మాజీ అధ్యక్షుడు బండి సంజయ్,( Bandi Sanjay ) ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి తో( Kishan Reddy ) పాటు ప్రచార కమిటీ చైర్మెన్ ఈటెల రాజేందర్( Etela Rajender ) కూడా రేస్ లో ఉన్నారు.సి‌ఎం అభ్యర్థి ఎవరనేది ఈ ముగ్గురి చుట్టే తిరుగుతోంది.

అయితే ఆ మద్య బీసీ సామాజిక వర్గం నుంచి సి‌ఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని అమిత్ షా( Amit Shah ) చెప్పడంతో ముదురాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఉండే అవకాశాలు తక్కువ అని చెబుతున్నారు విశ్లేషకులు.ఇకపోతే బండి సంజయ్ లేదా కిషన్ రెడ్డి ఇద్దరిలో ఎవరో ఒకరిని సి‌ఎం అభ్యర్థి గా ఎన్నుకునే ఛాన్స్ ఉందట.

Telugu Amit Shah, Bandi Sanjay, Bjp Cm Candi, Bjp, Etela Rajender, Kishan Reddy,

ఈ నేపథ్యంలో సి‌ఎం అభ్యర్థి విషయంలో బీజేపీ నేత మురళీధరరావు( Muralidhar Rao ) చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అవుతున్నాయి.బండి సంజయ్ సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఉన్నారని అందుకే ఆయనను అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తప్పించిందని మురళిధరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దీంతో బండి సంజయ్ నే బీజేపీ సి‌ఎం అభ్యర్థిగా అధిష్టానం ఫైనల్ చేసే అవకాశం ఉందా అనే వాదన నడుస్తోంది.కాగా బండి సంజయ్ కి ఇటీవల జాతీయ ప్రదాన కార్యదర్శి పదవి కట్టబెట్టి జాతీయ రాజకీయాల్లోకి( National Politics ) తీసుకుంది పార్టీ అధిస్థానం.

దీన్ని బట్టి చూస్తే సి‌ఎం అభ్యర్థిగా ఆయనకు ఛాన్స్ లు తక్కువ అనేది కొందరి అభిప్రాయం.

Telugu Amit Shah, Bandi Sanjay, Bjp Cm Candi, Bjp, Etela Rajender, Kishan Reddy,

ఇకపోతే కిషన్ రెడ్డి ని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగే అవకాశం ఉంది.ఎందుకంటే పార్టీని తెలంగాణలో బలపడేలా చేసింది తానేనని, బండి సంజయ్ ఈ మద్య నొక్కి చెబుతున్నారు.దీన్ని బట్టి చూస్తే సి‌ఎం అభ్యర్థిగా ఇతరులను నియమిస్తే బండి సంజయ్ నుంచి వ్యతిరేకత ఏర్పడడం ఖాయమనేది కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట.మొత్తానికి సి‌ఎం అభ్యర్థి విషయంలో కాషాయ పార్టీ తీవ్రమైన కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు చెప్పకతప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube